అలర్ట్: స్మార్ట్‌ఫోన్ వాడకం రోజుకు 5 గంటలు మించితే..

| Edited By:

Jun 01, 2020 | 6:53 PM

ఆధునిక సాంకేతిక ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్ లేకుండా ఉండటం అనేది దాదాపు అసంభవం. అయితే మనకు అనేక పనులకు స్మార్ట్‌ఫోన్లు ఉపయోగపడతాయి.. కానీ రోజుకు 5 గంటల కన్నా ఎక్కువగా వాడితే

అలర్ట్: స్మార్ట్‌ఫోన్ వాడకం రోజుకు 5 గంటలు మించితే..
Follow us on

5 hours daily use of smartphone: ఆధునిక సాంకేతిక ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్ లేకుండా ఉండటం అనేది దాదాపు అసంభవం. అయితే మనకు అనేక పనులకు స్మార్ట్‌ఫోన్లు ఉపయోగపడతాయి.. కానీ రోజుకు 5 గంటల కన్నా ఎక్కువగా వాడితే మాత్రం ప్రమాదమేనని సైంటిస్టులు చెబుతున్నారు. గుండె జబ్బులు, డయాబెటిస్ తదితర అనారోగ్య సమస్యలకు గురి కావల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.

కొలంబియాకు చెందిన సైమన్ బొలివర్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ సైంటిస్టులు 1060 విద్యార్థులపై చేపట్టిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. ఆ విద్యార్థులకు ఉన్న ఆహారపు అలవాట్లు, జబ్బులు తదితర వివరాలను సైంటిస్టులు సేకరించారు. అలాగే వారు నిత్యం ఎన్ని గంటల పాటు స్మార్ట్‌ఫోన్‌ను వాడుతారనే వివరాలను కూడా రాబట్టారు.

ఫలితంగా.. స్మార్ట్‌ఫోన్‌ను నిత్యం 5 గంటల కన్నా ఎక్కువగా వాడే విద్యార్థులు స్థూలకాయం బారిన పడే అవకాశాలు 42.6 శాతం వరకు ఎక్కువగా ఉంటాయని, అదే విద్యార్థినులు అయితే ఆ అవకాశాలు 57.4 శాతం వరకు ఉంటాయని తేల్చారు. ఈ క్రమంలోనే స్థూలకాయం వల్ల డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుందని, అది మన శరీరానికి ప్రమాదమని వారు హెచ్చరిస్తున్నారు. కనుక నిత్యం స్మార్ట్‌ఫోన్ల వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలని వారు సూచిస్తున్నారు.

Also Read: తెలంగాణలో జులై 1 నుంచి పాఠశాలలు ప్రారంభం.. మార్గదర్శకాలు ఇవే!