హైదరాబాద్ నారాయణగూడ కెనరా బ్యాంక్ లో అగ్నిప్రమాదం, అర్ధరాత్రి సమయంలో బిల్డింగ్ లో చెలరేగిన మంటలు

|

Dec 28, 2020 | 7:15 AM

హైదరాబాద్ నారాయణగూడ కెనరా బ్యాంక్ లో అగ్నిప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి సమయాన బిల్డింగ్ లో మంటలు చెలరేగడంతో బ్యాంక్ భద్రతాసిబ్బంది..

హైదరాబాద్ నారాయణగూడ కెనరా బ్యాంక్ లో అగ్నిప్రమాదం, అర్ధరాత్రి సమయంలో బిల్డింగ్ లో చెలరేగిన మంటలు
Follow us on

హైదరాబాద్ నారాయణగూడ కెనరా బ్యాంక్ లో అగ్నిప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి సమయాన బిల్డింగ్ లో మంటలు చెలరేగడంతో బ్యాంక్ భద్రతాసిబ్బంది అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్ లతో మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేశారు. బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లోని డ్రై క్లినర్స్ షాప్ ద్వారా మంటలు వ్యాపించి బ్యాంక్ లోకి దట్టంగా పొగ చేరుకుంది. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.