ఇటలీలో భారీ అగ్నిప్రమాదం

ఇటలీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నార్త్ ఇటలీలోని పెయింట్స్ ఫ్యాక్టరీలో మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి. మంటల ధాటికి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. మంటలు భారీగా వ్యాపించడంతో ఫైరింజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. రోజంతా ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాలేదు. అంతకంతకు మంటలు పెరగడంతో సమీప ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీలో పదుల సంఖ్యలో కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్ని ప్రమాదంలో ఫ్యాక్టరీ పూర్తిగా దగ్దమవడంతో […]

ఇటలీలో భారీ అగ్నిప్రమాదం

ఇటలీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నార్త్ ఇటలీలోని పెయింట్స్ ఫ్యాక్టరీలో మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి. మంటల ధాటికి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. మంటలు భారీగా వ్యాపించడంతో ఫైరింజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. రోజంతా ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాలేదు. అంతకంతకు మంటలు పెరగడంతో సమీప ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీలో పదుల సంఖ్యలో కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్ని ప్రమాదంలో ఫ్యాక్టరీ పూర్తిగా దగ్దమవడంతో భారీ నష్టం జరిగింది. ఈ అగ్నిప్రమాదం జరిగిన పెయింట్ ఫ్యాక్టరీ హైవేకు అత్యంత సమీపంలో ఉండటంతో వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం సాగించారు.

Click on your DTH Provider to Add TV9 Telugu