బ్రేకింగ్, ఈ నెల 26 న ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించి తీరుతాం, రైతు సంఘాల హెచ్ఛరిక, ఇక తాడోపేడో !

బ్రేకింగ్, ఈ నెల 26 న ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించి తీరుతాం, రైతు సంఘాల హెచ్ఛరిక, ఇక తాడోపేడో !

కేంద్రం తమను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐ ఏ ) ద్వారా టార్గెట్ చేస్తోందని, అయితే తాము భయపడే ప్రసక్తి లేదని రైతు సంఘాలు పేర్కొన్నాయి..

Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Jan 17, 2021 | 6:19 PM

Farmers Protest: కేంద్రం తమను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐ ఏ ) ద్వారా టార్గెట్ చేస్తోందని, అయితే తాము భయపడే ప్రసక్తి లేదని రైతు సంఘాలు పేర్కొన్నాయి.  ఈ నెల 26 న గణ తంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ ని నిర్వహించి తీరుతామని ప్రకటించాయి. ట్రాక్టర్ ర్యాలీ నిరసనను విరమించబోమని స్పష్టం చేశాయి.  రైతుల ఆందోళన నేపథ్యంలో ఓ జర్నలిస్ట్ సహా 40 మందికి  ఎన్ ఐ ఏ సమన్లు జారీ చేసిన విషయం గమనార్హం. రేపు ఢిల్లీలోని తమ కార్యాలయానికి వఛ్చి వాంగ్మూలం ఇవ్వాలని వీరిని కోరింది.  సిఖ్స్ ఫర్ జస్టిస్ అనే సంస్థ పై ఎన్ ఐ ఏ ఇదివరకే ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేసింది. రైతుల ఆందోళనను ఈ సంస్థ సమర్థిస్తున్నందున  ఈ నోటీసులు జారీ చేసింది.  ఈ సంస్థను లోగడేబ్యాన్ చేశారు. కాగా రైతుల తాజా నిర్ణయానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu