రెండో టెస్టులో ఇంగ్లాండ్ విజయం.. సిరీస్ సమం..

England draw level with Stokes’s all-round show: వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో ఆతిధ్య ఇంగ్లాండ్ జట్టు అద్భుత విజయం సాధించింది. 312 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో విండీస్ కేవలం 198 పరుగులకే ఆలౌట్ అయింది. స్టోక్స్, కెప్టెన్ జో రూట్ అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో ఇంగ్లాండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌ను 129 పరుగుల వద్ద డిక్లర్ చేసింది. దీనితో వెస్టిండీస్ ముందు 312 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది. ఇక లక్ష్యచేధనలో భాగంగా బ్యాటింగ్‌కు […]

రెండో టెస్టులో ఇంగ్లాండ్ విజయం.. సిరీస్ సమం..

Updated on: Jul 21, 2020 | 1:01 AM

England draw level with Stokes’s all-round show: వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో ఆతిధ్య ఇంగ్లాండ్ జట్టు అద్భుత విజయం సాధించింది. 312 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో విండీస్ కేవలం 198 పరుగులకే ఆలౌట్ అయింది. స్టోక్స్, కెప్టెన్ జో రూట్ అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో ఇంగ్లాండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌ను 129 పరుగుల వద్ద డిక్లర్ చేసింది. దీనితో వెస్టిండీస్ ముందు 312 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది.

ఇక లక్ష్యచేధనలో భాగంగా బ్యాటింగ్‌కు వచ్చిన విండీస్ జట్టు 198 ప[పరుగులకు కుప్పకూలింది. బ్రూక్స్, బ్లాక్‌వుడ్‌, హోల్డర్ మాత్రమే చెప్పుకోదగ్గ పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రాడ్ మూడు వికెట్లు, వోక్స్, బెస్, స్టోక్స్ రెండేసి వికెట్లు, సామ్ కరన్ ఒక్క వికెట్ పడగొట్టారు. ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన బెన్ స్టోక్స్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఈ విజయంతో ఇంగ్లాండ్ సిరీస్ ను 1-1తో సమం చేసింది.