హెల్మెట్ లేకుంటే.. డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు

రోడ్డు ప్రమాదాలు పూర్తి స్థాయిలో నియంత్రించడంపై సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే టూవీలర్ నడిపేవారితోపాట వెనకాల కూర్చునే వారికి హెల్మెట్‌ లేకుంటే ఈ–చలాన్లు జారీ చేస్తున్న పోలీసులు.. ఇకపై మరిన్ని చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.

హెల్మెట్ లేకుంటే.. డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు

Updated on: Nov 06, 2020 | 2:33 AM

రోడ్డు ప్రమాదాలు పూర్తి స్థాయిలో నియంత్రించడంపై సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే టూవీలర్ నడిపేవారితోపాట వెనకాల కూర్చునే వారికి హెల్మెట్‌ లేకుంటే ఈ–చలాన్లు జారీ చేస్తున్న పోలీసులు.. ఇకపై మరిన్ని చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.

మోటార్‌ వెహికల్‌ చట్టం– 2019 ప్రకారం హెల్మెట్‌ లేకుంటే రూ.వెయ్యి జరిమానాతో పాటు 3 నెలల పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ సస్పెండ్‌ చేయొచ్చన్న అంశాలు వాహన దారులకు తెలిసేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ‘ఇప్పటివరకు జరుగుతున్న చాలా వరకు రోడ్డు ప్రమాదాల సమయంలో నడిపేవారకిి హెల్మెట్‌ లేకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోాయారని తేలింది.

దీంతో హెల్మెట్‌ ధరించని వారికి జరిమానాతో పాటు 3 నెలల డ్రైవింగ్‌ లైసెన్స్‌ సస్పెండ్‌ చేసే దిశగా కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు నియమించిన కమిటీ నివేదించింది. ఇదే విషయాన్ని వాహనచోదకులకు అవగాహన కలిగించే దిశగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆ తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం అదేశాను సారం చర్యలు తీసుకోనున్నారని తెలుస్తోంది.