టిక్‌టాక్‌కు షాక్..! భారీగా తగ్గిన రేటింగ్‌, డౌన్‌లోడ్స్..!

టిక్‌టాక్‌.. ఈ యాప్ ను ఎక్కువగా భారత్‌లోనే ఉపయోగిస్తారు. టిక్‌టాక్‌ అతి తక్కువకాలంలోనే అత్యధిక పాపులారిటీ సాధించింది. ప్రస్తుతం ఈ యాప్ రేటింగ్ పూర్తిగా దిగజారిపోయింది.

టిక్‌టాక్‌కు షాక్..! భారీగా తగ్గిన రేటింగ్‌, డౌన్‌లోడ్స్..!

Edited By:

Updated on: May 27, 2020 | 10:04 AM

TikTok ratings fall: టిక్‌టాక్‌.. ఈ యాప్ ను ఎక్కువగా భారత్‌లోనే ఉపయోగిస్తారు. టిక్‌టాక్‌ అతి తక్కువకాలంలోనే అత్యధిక పాపులారిటీ సాధించింది. ప్రస్తుతం ఈ యాప్ రేటింగ్ పూర్తిగా దిగజారిపోయింది. అందుకు రెండు కారణాలు.. ఒకటి కరోనా వైరస్ అయితే.. మరొకటి అనుచిత, ప్రేరేపిత, హింసాత్మక వీడియోల కారణంగా భారత యూజర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇక టిక్ టాక్ యాప్ చైనా ప్రోడక్ట్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. సో ఈ రెండింటి కారణంగా కొన్ని రోజులుగా టిక్ టాక్‌ను బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధం జరుగుతోంది.

కాగా.. ఈ యాప్ రేటింగ్ ఒక్కసారిగా పడిపోయింది. ఏప్రిల్‌, మే నెలల్లో ఈ యాప్‌ డౌన్‌లోడ్‌లను పరిశీలిస్తే అంతకు ముందు రెండు నెలల కంటే భారీ స్థాయిలో పడిపోయింది. ఏప్రిల్‌లో 34శాతం, మే(23 తేదీ నాటికి)లో 28శాతం డౌన్‌లోడ్‌లు పడిపోయినట్లు సమాచారం. ఇది అంతకు ముందు రెండు నెలల్లో(మార్చిలో 8శాతం, ఫిబ్రవరిలో 7శాతం) పెరుగుదల ఉండగా ఏప్రిల్‌, మే నెలల్లో భారీగా తగ్గింది. మార్చి నెలలో దాదాపు మూడున్నర కోట్ల వినియోగదారులు దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకోగా ఏప్రిల్‌ నాటికి 2.3కోట్లకు, మే నెలలో 1.7కోట్లకు పడిపోవడం గమనార్హం.