కోవిడ్ అంటే భయపడకండి, కర్నాటక సీఎం ఎడియూరప్ప

కోవిడ్-19 అంటే భయపడరాదని కర్నాటక సీఎం ఎడియూరప్ప పిలుపునిచ్చారు. అభివృధ్ది అనే 'మంత్రం' తో ఈ పాండమిక్ ని తరిమి 'సంక్షేమ రాష్ట్రం' గా కర్నాటకను తీర్చిదిద్దుతామన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా..

కోవిడ్ అంటే భయపడకండి, కర్నాటక సీఎం ఎడియూరప్ప

Edited By:

Updated on: Aug 15, 2020 | 5:21 PM

కోవిడ్-19 అంటే భయపడరాదని కర్నాటక సీఎం ఎడియూరప్ప పిలుపునిచ్చారు. అభివృధ్ది అనే ‘మంత్రం’ తో ఈ పాండమిక్ ని తరిమి ‘సంక్షేమ రాష్ట్రం’ గా కర్నాటకను తీర్చిదిద్దుతామన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం బెంగుళూరులో  తమ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. తనకు కూడా కోవిడ్ సోకిందని, అయితే పూర్తిగా కోలుకున్నానని చెప్పారు. ఈ సందర్భంగా మీకో మెసేజ్ ఇస్తున్నా..ఈ వైరస్ అంటే ఆందోళన చెందకండి.. భయపడకండి..ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది. లక్షలాది మంది కోలుకుంటున్నారు అని ఆయన పేర్కొన్నారు. ఇది కేవలం ఆరోగ్య రంగాన్నే కాక, పరిశ్రమల రంగాన్ని కూడా దెబ్బ తీసిందని, లాక్ డౌన్ కారణంగా ప్రతి జీవితంపైనా దెబ్బ కొట్టిందని 77 ఏళ్ళ ఎడియూరప్ప వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడిప్పుడే దేశం కోలుకుంటోందన్నారు.

అభివృధ్ది తో కూడిన ‘కల్యాణ కర్నాటక’ ను  తేవాలన్నదే తన అభిమతమని ఆయన చెప్పారు. కోవిడ్ వారియర్లకు ఆయన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. వారి కృషి, సేవా నిరతి ప్రశంసనీయమన్నారు. .మరి కొంత కాలంలో కరోనా వైరస్  విరుగుడు వ్యాక్సీన్ రాబోతోందని, ఈ పాండమిక్ నశించడం ఖాయమన్న విశ్వాసాన్నిఆయన వ్యక్తం చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us