
దేశ రాజధానిలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న చాపకింద నీరులా విస్తరిస్తోంది. సెంట్రల్ ఢిల్లీలోని రైల్ భవన్‌లో పనిచేసే ఓ ఉద్యోగినికి సోమవారం కోవిడ్-19 పరీక్షలో పాజిటివ్‌గా తేలింది. మే 20న చివరిసారిగా ఆమె విధులకు హాజరైనట్టు సమాచారం. ఇదే భవనంలో గత రెండు వారాలుగా ఐదు కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తాజాగా కరోనా పాజిటివ్ వచ్చిన ఉద్యోగినితో కలిసి కార్యాలయ విధుల్లో పనిచేసిన 14 మంది అధికారులను హోం క్వారంటైన్‌కు పంపారు. రైల్ భవన్‌లో పాజిటివ్ కేసులు నమోదవడంతో భవనంలో శానిటైజేషన్ చేపట్టేందుకు ఈనెల 14, 15 తేదీల్లో రైల్ భవన్‌ను మూసివేశారు.