భారత జవాన్ల మరణం తీవ్ర వేదన కలిగించింది…

తూర్పు లదాఖ్‌లోని గాల్వన్ లోయ ప్రాంతలో భారత్- చైనా దళాల మధ్య జరిగిన హింసాత్మక ఘటనపై తాజాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పందించారు.

భారత జవాన్ల మరణం తీవ్ర వేదన కలిగించింది...
Follow us

|

Updated on: Jun 17, 2020 | 6:20 PM

తూర్పు లదాఖ్‌లోని గాల్వన్ లోయ ప్రాంతలో భారత్- చైనా దళాల మధ్య జరిగిన హింసాత్మక ఘటనపై తాజాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పందించారు. వీరమరణం పొందిన 20 మంది భారత సైనికులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఒక వీడియో సందేశం ద్వారా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మాట్లాడుతూ.. ‘గాల్వన్ లోయలో భారత్, చైనా బలగాల మధ్య 20 మంది జవాన్లు మృతి చెందటం దేశం మొత్తాన్ని తీవ్ర ఆవేదనకు గురి చేసింది. వీరజవాన్ల ధైర్య సాహసాలకు తెలపడమే కాకుండా వారికి నివాళులు అర్పిస్తున్నా. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఈ ఘటనపై ఆగ్రహంగా ఉన్నారు. నెలన్నరగా భారత సరిహద్దుల్లో చైనా సైన్యాన్ని మోహరించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మీడియా ముందుకు వచ్చి అసలు నిజం బయటపెట్టాలి. భారత భూభాగం ఎలా దూరాక్రమణకు గురైందో.. సరిహద్దు ఘర్షణల్లో ఎంతమంది సైన్యం బలయ్యారో, ఎంత మంది గాయపడ్డారో స్పష్టం చేయాలి. భారత్, చైనా సరిహద్దు అంశంపై అందరం  కలిసి పోరాడడం అని ఆమె పిలుపునిచ్చారు.

Also Read:

నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్…

బ్రేకింగ్: సుశాంత్ కుటుంబంలో మరో విషాదం..

ఏపీ నిట్ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. 25 మార్కులకే పరీక్ష!

30 ఏళ్ల పాటు జగన్ సీఎంగా ఉండాలనుకుంటున్నాః రఘురామకృష్ణంరాజు

‘సుశాంత్‌పై కపట ప్రేమ చూపిస్తున్నారు’.. నెపోటిజంపై సైఫ్ ఫైర్..