Breaking: డీడీ న్యూస్ తాత్కాలికంగా మూసివేత.. ఎందుకంటే..?

| Edited By: Pardhasaradhi Peri

May 29, 2020 | 4:40 PM

కరోనా దెబ్బకు దేశం విలవిలలాడుతోంది. రోజు రోజుకి రోజుల సంఖ్య గణనీయంగా పెరుతోంది. దీనికి తోడు రోజూ వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ న్యూస్ చానెల్‌కు చెందిన వీడియో జర్నలిస్ట్ కరోనాతో చనిపోయాడు. దీంతో డీడీ న్యూస్ చానెల్‌ను తాత్కాలికంగా మూసివేశారు. ఢిల్లీలోని దూరదర్శన్ న్యూస్ చానెల్‌లో వీడియో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్న యోగేశ్ కుమార్ గుండెపోటుతో మరణించాడు. అనుమానంతో అతనికి కరోనా పరీక్షలు చేయగా.. పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ చానెల్‌లో అదే డిపార్ట్‌మెంట్‌లో […]

Breaking: డీడీ న్యూస్ తాత్కాలికంగా మూసివేత.. ఎందుకంటే..?
Follow us on

కరోనా దెబ్బకు దేశం విలవిలలాడుతోంది. రోజు రోజుకి రోజుల సంఖ్య గణనీయంగా పెరుతోంది. దీనికి తోడు రోజూ వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ న్యూస్ చానెల్‌కు చెందిన వీడియో జర్నలిస్ట్ కరోనాతో చనిపోయాడు. దీంతో డీడీ న్యూస్ చానెల్‌ను తాత్కాలికంగా మూసివేశారు.
ఢిల్లీలోని దూరదర్శన్ న్యూస్ చానెల్‌లో వీడియో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్న యోగేశ్ కుమార్ గుండెపోటుతో మరణించాడు. అనుమానంతో అతనికి కరోనా పరీక్షలు చేయగా.. పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ చానెల్‌లో అదే డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న సిబ్బంది మొత్తానికి కరోనా పరీక్షలు చేయనున్నారు.డీడీ న్యూస్ చానెల్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. శానిటైజేషన్ చేసిన తర్వాత ఆఫీసును త్వరలోనే తెరుస్తామన్నారు. అయితే ఆఫీస్ తాత్కాలికంగా మూసివేయడం వల్ల వార్తాప్రసారాలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నామని డీడీ న్యూస్‌కు చెందిన ఒక అధికారి తెలిపారు. యోగేష్ మరణంతో కెమెరా విభాగానికి చెందిన మొత్తం సిబ్బందిలో కొంతమందిని డాక్టర్ రాంమనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీడీ న్యూస్ వర్గాలు తెలిపాయి.