Burevi Cyclone Updates: బురేవీ తుపానుతో చెన్నైకి పొంచి ఉన్న ముప్పు, ఏపీలో చిత్తూరు, నెల్లూరు జిల్లాలకూ గండం !

బురేవీ తుపాను ప్రభావం వల్ల తమిళనాడులో ముఖ్యంగా కడలూరు, అరియలూరు, నాగపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సుమారు 34  సెం .మీ. వర్షపాతం నమోదయినట్టు అంచనా. 18 గంటలు గా సముద్రంలో..

Burevi Cyclone Updates: బురేవీ తుపానుతో చెన్నైకి పొంచి ఉన్న ముప్పు, ఏపీలో చిత్తూరు, నెల్లూరు జిల్లాలకూ గండం !
Follow us

| Edited By: Venkata Narayana

Updated on: Dec 04, 2020 | 9:51 PM

బురేవీ తుపాను ప్రభావం వల్ల తమిళనాడులో ముఖ్యంగా కడలూరు, అరియలూరు, నాగపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సుమారు 34  సెం .మీ. వర్షపాతం నమోదయినట్టు అంచనా. 18 గంటలు గా సముద్రంలో స్థిరంగా ఉన్న తుపాను కారణంగా పలు చోట్ల చెదురుమదురు వర్షాలు పడుతున్నాయి. రామనాథపురానికి  సుమారు 40 కి.మీ. దూరంలో సముద్రంలో ఇది కేంద్రీకృతమై ఉందని, రానున్న 12 గంటల్లో ఇది దిశ మార్చుకుని పుదుచ్ఛేరి, చెన్నై వైపు వెళ్తుందని వాతావరణ శాఖ పేర్కొంది. తమిళనాట 4 జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ఇది దిశ మారిన  పక్షంలో ఏపీలో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. పుదుచ్ఛేరిలో శుక్రవారం  14 సెం. మీ.వర్షం కురిసింది. కాగా.. కేరళలో తుపాను ప్రభావం తగ్గడంతో రెడ్ అలెర్ట్ హెచ్చరికను ఉపసంహరించారు.

Latest Articles