‘కోవాగ్జిన్‌’ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు డీసీజీఐ గ్రీన్ సిగ్నల్

ప్రపంచం అంతా ఆశగా ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించి తుది దశ ప్రయోగాలు పూర్తి చేసుకుంటుంది.

‘కోవాగ్జిన్‌’ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు డీసీజీఐ గ్రీన్ సిగ్నల్
Follow us

|

Updated on: Oct 23, 2020 | 7:56 AM

ప్రపంచం అంతా ఆశగా ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించి తుది దశ ప్రయోగాలు పూర్తి చేసుకుంటుంది. దేశీయంగా రెండు సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ‘కోవాగ్జిన్‌’ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతించింది. భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌)తో కలిసి హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న భారత్‌ బయోటెక్ సంస్థ కరోనా టీకా తయారీలో వేగం పెంచింది. కరోనా టీకా మూడో దశ ట్రయల్స్‌ అనుమతి కోసం భారత్‌ బయోటెక్‌ అక్టోబర్‌ 2న డీసీజీఐకి దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 19 వేర్వేరు ప్రాంతాల్లో 18ఏళ్లకు పైబడిన వారిపై పరిశోధన చేయనున్నట్లు సంస్థ డీజీసీఐకి తెలిపింది. మరోవైపు, జైడస్‌ క్యాడిలా సంస్థ అభివృద్ధి చేస్తున్న కొవిడ్‌ టీకా సైతం రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ తుది దశకు చేరుకున్నాయి. పుణెకు చెందిన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఆస్ట్రాజెనికాతో కలిసి రూపొందిస్తున్న ఆక్స్‌ఫర్డ్‌ టీకా భారత్‌లో రెండు, మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ కొనసాగిస్తుంది. ఇక త్వరలో తుది దశ ట్రయల్స్ పూర్తి చేసుకుని కరోనా వ్యాక్సిన్ మార్కెట్ లోకి రావచ్చని నిపుణులు భావిస్తున్నారు.