
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 605 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చెందిన కేసులు 570 కాగా, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చినవారిలో 35 మందికి కరోనా సోకింది. దీంతో ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 11,489కి చేరింది. ఇందులో 6,147 పాజిటివ్ కేసులు ఉండగా, 5196 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు కరోనా కారణంగా 146 మంది మరణించారు. ఇక గడిచిన 24 గంటల్లో 191 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, 10 మంది కరోనాతో మృతి చెందారు. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో 7,91,624 శాంపిల్స్ పరీక్షించారు.
జిల్లాల వారీగా నమోదైన కేసులు వివరాలు చూస్తే.. గడిచిన 24 గంటల్లో అనంతరపురంలో 79, పశ్చిమ గోదావరి 79, గుంటూరు 74, కర్నూలు 60, ప్రకాశం 28, చిత్తూరు 26, విజయనగరం 23, విశాఖపట్నం 20, కృష్ణా 20, నెల్లూరు 15, తూర్పుగోదావరి 12, శ్రీకాకుళంలో ఒక్క కరోనా కేసు నమోదైంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 34 మందికి, విదేశాల నుంచి వచ్చినవారిలో ఒకరికి కరోనా సోకింది.
#COVIDUpdates: 26/06/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 9353 పాజిటివ్ కేసు లకు గాను
*4021 మంది డిశ్చార్జ్ కాగా
*146 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 5186 #APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/YkRg1oMGAo— ArogyaAndhra (@ArogyaAndhra) June 26, 2020