Coronavirus Effect: కరోనా వైరస్ మహమ్మారి స్విట్జర్లాండ్ దేశాన్ని అల్లకల్లోలం చేస్తోంది. ఆ దేశంలో ఇప్పటివరకు 11 వేల కేసులు నమోదు కాగా.. 192 ప్రాణాలు విడిచారు. దీనితో సొంత దేశ ప్రజలను ఆదుకునేందుకు ప్రపంచ మాజీ నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్, స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ముందుకు వచ్చాడు. కోవిడ్ 19 బారిన పడి కష్టాలు అనుభవిస్తున్న కుటుంబాలకు ఒక మిలియన్ స్విస్ ఫ్రాన్స్(అంటే దాదాపు 77 కోట్ల 69 లక్షలు) ఇవ్వనున్నట్లు ప్రకటించాడు.
ఇక ఫెదరర్ ప్రకటించిన ఈ సాయాన్ని అభినందిస్తూ బిల్ గేట్స్ ట్వీట్ చేయడమే కాకుండా ‘మీ నిర్ణయం చాలా గొప్పదంటూ’ ప్రశంసలు కురిపించారు. కాగా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గణాంకాలు అనుగుణంగా కరోనా బాధిత దేశాల్లో స్విట్జర్లాండ్ 9వ స్థానంలో ఉంది. స్విస్ ఆరోగ్య శాఖ లెక్కలు ప్రకారం 11 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడమే కాకుండా ఈ వ్యాధి బారిన పడి 192 మంది మృత్యువాతపడ్డారు.
For More News:
తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు..?
కరోనా కల్లోలం.. చైనాను దాటేసిన అమెరికా..
కరోనా ఎఫెక్ట్.. ఏపీలో ఏ టైంకు ఏవి దొరుకుతాయి..?