అంతర్వేది దేవాలయంలో మరోసారి కరోనా కలకలం

|

Nov 05, 2020 | 9:27 PM

దేశవ్యాప్తంగా దేవస్థానాల్లోనూ కరోనా కలకలం రేపుతుంది. తూర్పు గోదావరి జిల్లాలో అంతర్వేది శ్రీలక్ష్మినరసింహస్వామి దేవాలయంలో మరోసారి కరోనా కలకలం రేగింది.

అంతర్వేది దేవాలయంలో మరోసారి కరోనా కలకలం
Follow us on

దేశవ్యాప్తంగా దేవస్థానాల్లోనూ కరోనా కలకలం రేపుతుంది. తూర్పు గోదావరి జిల్లాలో అంతర్వేది శ్రీలక్ష్మినరసింహస్వామి దేవాలయంలో మరోసారి కరోనా కలకలం రేగింది. దేవాలయంలో పనిచేసే నలుగురు అర్చకులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో శుక్రవారం ఒక్క రోజు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ సహాయ కమిషనర్‌ యర్రంశెట్టి భద్రాజీ ప్రకటించారు. ఆలయానికి వచ్చే భక్తులకు రేపు దర్శనం నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కేశఖండనశాల సిబ్బందికి కొవిడ్‌ రావడంతో కేశఖండనశాల సేవలను రద్దు చేశారు. కొన్నిరోజుల పాటు పరిసరాలను శానిటేషన నిర్వహించి మిగిలిన సిబ్బందికి కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనుమానితులను ముందస్తుగా హోం ఐసోలేషన్ ఉండాలని ఆలయ అధికారులు సూచించారు.