టర్కీ కోవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. మంటలు అంటుకుని 9 మంది మృతి

|

Dec 19, 2020 | 6:53 PM

టర్కీ దేశంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరగింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలను కోల్పోయారు.

టర్కీ కోవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. మంటలు అంటుకుని 9 మంది మృతి
Follow us on

టర్కీ దేశంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరగింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలను కోల్పోయారు. దక్షిణ టర్కీలోని కోవిడ్ రోగులకు చికిత్స చేస్తున్న ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో శనివారం మంటలు చెలరేగాయి. ఆక్సిజన్ సిలిండర్ పేలి 9 మంది మృతి చెందారని ఆ దేశ ఆరోగ్య మంత్రి తెలిపారు.

ఇస్తాంబుల్‌కు ఆగ్నేయంగా 850 కిలోమీటర్లు దూరంలోని గాజియాంటెప్‌లోని ప్రైవేటుగా నడుస్తున్న సాంకో యూనివర్శిటీ హాస్పిటల్ యూనిట్ వద్ద ఈ అగ్నిప్రమాదం జరిగిందని ప్రభుత్వ అనడోలు వార్తా సంస్థ తెలిపింది. కరోనా బారినపడ్డ బాధితులు 56 నుంచి 85 మధ్య ఉన్నట్లు ఆసుపత్రివర్గాలు తెలిపాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను త్వరగా అదుపులోకి తెచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

ఆస్పత్రిలో ఈ ఉదయం “హై ప్రెజర్ ఆక్సిజన్ పరికరం” పేలినప్పుడు 19 మంది రోగులు యూనిట్‌లో ఉన్నారని గవర్నర్ కార్యాలయం తెలిపింది. ప్రాణాపాయం తప్ప, మంటల్లో ఇతరులు గాయపడలేదు. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారని ఆరోగ్య మంత్రి ఫహ్రెటిన్ కోకా ట్వీట్ చేశారు. ఇంటెన్సివ్ కేర్ చికిత్స పొందుతున్న 14 మంది రోగులను ఇతర ఆసుపత్రులకు తరలించినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు.