హైదరాబాద్ ప్రజలకు థ్యాంక్స్ చెప్పిన సీపీ అంజనీ కుమార్

ప్రశాంతంగా జరిగిన వేడుకలపై పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ స్పందించారు. గ‌ణేష్ నిమ‌జ్జ‌నానికి స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క‌రికి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్న‌ట్లు అంజ‌నీ కుమార్ వెల్లడించారు...

హైదరాబాద్ ప్రజలకు థ్యాంక్స్ చెప్పిన సీపీ అంజనీ కుమార్

Updated on: Sep 02, 2020 | 1:17 PM

భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనోత్సవం ఘనంగా జరిగింది. ప్రశాంతంగా జరిగిన వేడుకలపై పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ స్పందించారు. గ‌ణేష్ నిమ‌జ్జ‌నానికి స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క‌రికి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్న‌ట్లు అంజ‌నీ కుమార్ వెల్లడించారు. గ‌ణేష్ నిమ‌జ్జ‌నం శాంతియుతంగా నిర్వ‌హించేందుకు మండ‌పాల నిర్వాహ‌కులు, సిటీ పోలీసులు ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు అని ప్ర‌శంసించారు. సామ‌ర‌స్యంగా వేడుక‌లు జ‌రుపుకోవ‌డం ఎంతో సంతోషించ‌ద‌గ్గ విష‌య‌మ‌ని సీపీ పేర్కొన్నారు. ప్ర‌పంచానికి హైద‌రాబాద్ ఆద‌ర్శంగా నిలిచింద‌న్నారు సీపీ.

Loading...
Unable to load recommendations.
Follow Us