Akash Missiles Export: ఆకాశ్‌ క్షిపణుల ఎగుమతులకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌: రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

|

Dec 31, 2020 | 4:37 PM

Akash Missiles Export: ఆకాశ్‌ క్షిపణుల ఎగుమతులకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిందని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్‌ సింగ్‌ ట్విటర్‌లో వెల్లడించారు. వివిధ దేశాల...

Akash Missiles Export: ఆకాశ్‌ క్షిపణుల ఎగుమతులకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌: రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌
Follow us on

Akash Missiles Export: ఆకాశ్‌ క్షిపణుల ఎగుమతులకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిందని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్‌ సింగ్‌ ట్విటర్‌లో వెల్లడించారు. వివిధ దేశాల ప్రతిపాదనలకు వేగంగా అనుమతులు ఇచ్చేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెట్‌ను ఏర్పాటు చేసిందని, ఇందులో రక్షణమంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రి, జాతీయ భద్రత సలహాదారు సభ్యులు ఉంటారని తెలిపారు. భారత సైన్యం వద్ద గల ఆకాశ్‌ క్షిపణులతో పోలిస్తే ఎగుమతి చేసేవి భిన్నంగా ఉంటాయని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు. రూ.36 వేల కోట్ల విలువైన రక్షణ ఎగుమతులు చేట్టాలని కేంద్ర సర్కార్‌ లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు.

రక్షణ ఎగుమతుల్లో 2025 నాటికి రూ.1.7 లక్షల కోట్ల టర్నోవర్‌ సాధించాలని కేంద్రం భావిస్తోందన్నారు. ఈ ఎగుమతులను చేసేందుకు 108 అనువైన సైనిక వ్యవస్థలను డీఆర్‌డీవో గుర్తించిందన్నారు. ఉపరితలం నుంచి గగనతరంలోకి దూసుకెళ్లే ఈ స్వదేశీ తయారీ క్షిపణి 25 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదని వెల్లడించారు.

Also Read: 2020 Lockdown Lesson: మ‌నిషి త‌లుచుకుంటే ఏదైనా సాధించ‌వ‌చ్చు.. 2020 సంవ‌త్స‌రంలో లాక్‌డౌన్ నేర్పిన గుణ‌పాఠాలు