ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆరోన్ ఫించ్ లేకపోవడంతో ఆస్ట్రేలియాకు మాథ్యూ వేడ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. తొలి టీ20 ఆడిన మనీష్ పాండే, మహ్మద్ షమి, రవీంద్ర జడేజా ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు. అటు ఆసీస్ టీమ్‌లో తొలి టీ20 ఆడిన ఫించ్, స్టార్క్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు. టాప్ ఫామ్‌లో ఉన్న హేజిల్‌వుడ్ కూడా ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు. ఈ ముగ్గురి స్థానంలో స్టాయినిస్, సామ్స్, ఆండ్రూ టై టీమ్‌లోకి వచ్చారు.
భారత్ జట్టు సభ్యులు : ధావన్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), సంజు శాంసన్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్య, సుందర్, దీపక్ చాహర్, నటరాజన్, చాహల్, శార్దూల్
ఆస్ట్రేలియా జట్టు సభ్యులు : షార్ట్, స్టాయినిస్, స్టీవ్ స్మిత్, హెన్రిక్స్, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ వేడ్ (కెప్టెన్), డేనియల్ సామ్స్, అబాట్, ఆండ్రూ టై, స్వెప్సన్, జంపా