ప్రస్తుతం ‘ఇనవే బర్రె పిల్లా.. నువ్వు వినవే బర్రె పిల్లా.. ఇన్నావా బర్రె పిల్లా.. నేనే నా ఎర్రి గొల్లా’ అనే సాంగ్ టిక్‌టాక్‌లో హల్‌చల్ చేస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ పాటను నెటిజన్లు విచిత్రమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో ఫన్నీగా వీడియోలు చేసి సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా అందరి చూపూ ఈ పాటపై పడింది. ఈ పాటకి సెలబ్రిటీస్ కూడా ముగ్ధులవుతున్నారు.
‘తాజాగా ఈ పాటను మంచు లక్షి ట్వీట్ చేసింది. ఈ బర్రె పిల్ల పాట తన బుర్రలో నుంచి వెళ్లట్లేదంటూ ఫన్నీగా ట్వీట్ చేసింది లక్ష్మీ’. కాగా ఇంతకీ ఈపాట దిగ్గజ కథనాయకుడు ఎన్టీఆర్ హీరోగా 1957లో తీసిన ‘వీర కంకణం’ సినిమాలోనిది. కేవలం బర్రె పిల్లా అనే లిరిక్స్ వింటేనే నవ్వొస్తుంది కానీ పూర్తి పాటలో మాత్రం ఎంతో అద్భుతమైన అర్థం ఉంది.
Can’t get this song out of my head ??vinnavey barri pilla ? pic.twitter.com/HQ58Ufq0ec
— Lakshmi Manchu (@LakshmiManchu) April 21, 2020
Read More:
సీఎం కేసీఆర్‌కు ఆర్జీవీ దిమ్మతిరిగే ఛాలెంజ్..