బ్రూసెల్లోసిస్‌… తస్మాత్ జాగ్రత్త.!

చైనాలో మరో మహమ్మారి పురుడుపోసుకున్న సంగతి తెలిసిందే. బ్రుసెల్లా అనే బ్యాక్టీరీయా ద్వారా వ్యాపించే ఆ వ్యాధి పేరు 'బ్రూసెల్లోసిస్'. తాజాగా ఈ వ్యాధి భారత్‌లో ప్రబలే..

బ్రూసెల్లోసిస్‌... తస్మాత్ జాగ్రత్త.!
Follow us

|

Updated on: Sep 26, 2020 | 6:42 PM

Brucellosis Outbreak: కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలతో పాటు భారత్‌ కూడా అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే దేశంలో 57 మిలియన్ల మందికి ఈ వైరస్ సోకగా.. 91,149 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు విడిచారు. ఇదిలా ఉంటే కొద్దిరోజుల క్రితం చైనాలో మరో మహమ్మారి పురుడుపోసుకున్న సంగతి తెలిసిందే. బ్రుసెల్లా అనే బ్యాక్టీరీయా ద్వారా వ్యాపించే ఆ వ్యాధి పేరు ‘బ్రూసెల్లోసిస్’. తాజాగా ఈ వ్యాధి భారత్‌లో ప్రబలే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు.  (ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ.. ఆ ప్రదేశాల్లో లిక్కర్ షాపులకు నో పర్మిషన్..)

ముఖ్యంగా ఈ వ్యాధి జంతువుల నుంచి వ్యాపిస్తుంది. పాశ్చరైజ్ చేయని పాల ఉత్పత్తులు, అపరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకున్నప్పుడు ఈ బ్యాక్టీరియా మనుషులకు సోకుతుంది. పాడి పంటలకు నెలవైన భారత్‌లో ఆవులు, గేదెలు, పందుల ద్వారా ఈ వ్యాధి వ్యాపించే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. గతంలో కూడా బ్రూసెల్లోసిస్ కేసులు వచ్చాయని.. అందుకే ముందుగా అప్రమత్తం కావడం మంచిదని తెలిపారు. ఈ వ్యాధి సోకినవారికి జ్వరం, తలనొప్పి, కడుపు నొప్పి, కండరాల నొప్పి, చెమటలు పట్టడం, ఆయాసం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. (కరోనాపై ఎస్పీ బాలు చివరి పాట.. ఎంత మధురంగా పాడారంటే.!)

కాగా, ఈ వ్యాధి మొదటిగా చైనాలోని ల్యాన్ఝౌ నగరంలో 3వేల మందికి సోకింది. ఓ ఫార్మాసిటికల్ కంపెనీ నుంచి ఈ బ్యాక్తీరియా బయటికి వచ్చింది. ప్రస్తుతానికి అయితే అక్కడ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ వ్యాధి బారిన పడిన వారు కోలుకునేందుకు వారాల నుంచి నెలల వరకు సమయం పెట్టవచ్చునని.. యాంటీ బయోటిక్స్ ద్వారా వ్యాధి నయం అవుతుందని వైద్యులు తెలిపారు. కాగా, విదేశాల నుంచి వచ్చేవారితో పాటు స్వదేశంలో ఉన్నవారికి కరోనా టెస్టులతో పాటు బ్రూసెల్లోసిస్‌ నిర్ధారణ పరీక్షలు కూడా చేయాలని సూచిస్తున్నారు. (సెప్టెంబర్ 25.. టాలీవుడ్ ఇండస్ట్రీకి బ్లాక్ డే..)

Latest Articles