Brain Lara Favorite Cricketer: కోహ్లీ, రోహిత్‌ల కంటే.. రాహులే ది బెస్ట్..

|

Mar 10, 2020 | 10:43 PM

Brain Lara Favorite Cricketer: అంతర్జాతీయ క్రికెట్‌లో వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆయన పేరిట ఎన్నో రికార్డులు ఉన్నాయి. అంతేకాకుండా టెస్టుల్లో 400 పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్‌‌‌‌మెన్ కూడా. ఇప్పటివరకు ఆ రికార్డును మరెవరూ కూడా బ్రేక్ చేయలేదు. ఇక తాజాగా లారాను ఈతరం ఆటగాళ్లలో మీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరని ప్రశ్నించగా.. దానికి కొంచెం ట్రీకీగా సమాధానమిచ్చాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మలను పక్కన […]

Brain Lara Favorite Cricketer: కోహ్లీ, రోహిత్‌ల కంటే.. రాహులే ది బెస్ట్..
Follow us on

Brain Lara Favorite Cricketer: అంతర్జాతీయ క్రికెట్‌లో వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆయన పేరిట ఎన్నో రికార్డులు ఉన్నాయి. అంతేకాకుండా టెస్టుల్లో 400 పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్‌‌‌‌మెన్ కూడా. ఇప్పటివరకు ఆ రికార్డును మరెవరూ కూడా బ్రేక్ చేయలేదు. ఇక తాజాగా లారాను ఈతరం ఆటగాళ్లలో మీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరని ప్రశ్నించగా.. దానికి కొంచెం ట్రీకీగా సమాధానమిచ్చాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మలను పక్కన పెట్టేసి.. టీ20 సూపర్ స్టార్ కేఎల్ రాహుల్‌కు లారా ఓటేశాడు. తనకు రాహుల్ అంటే చాలా ఇష్టమని పేర్కొన్నాడు.

‘రాహుల్ పక్కా ఎంటర్టైనర్. అతడి బ్యాటింగ్ తీరు అద్భుతంగా ఉంటుంది. అతని బ్యాటింగ్ చూడటానికి ఎంతగానో ఇష్టపడతాను. అద్భుతమైన క్లాస్ ప్లేయర్’ అని లారా తెలిపాడు. అటు నాలుగు రోజుల టెస్టుల ప్రతిపాదనపై కూడా లారాను ప్రశ్నించగా.. ‘ఐదు లేక నాలుగు రోజులు టెస్టులు ఆడుతున్నామన్నది సమస్య కాదని.. ప్రతీ మ్యాచ్‌కు ఫలితం వస్తే అప్పుడు ఎన్ని రోజులు ఆడినా ఫర్వాలేదని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా మ్యాచ్‌ ఆసక్తిగా కొనసాగితేనే అభిమానులు ఆదరిస్తారన్నాడు.

For More News:

మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్…

సోషల్ మీడియాపై ఆసక్తి లేదు.. ఫ్యాన్ పేజీలకు సపోర్ట్ చేయనుః అజిత్

నిరుద్యోగులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త…

విద్యార్థులకు అదిరిపోయే గిఫ్ట్.. ‘జగనన్న విద్యా కానుక’ కిట్స్ సిద్ధం…

కరోనా ఎఫెక్ట్.. విరాట్ కోహ్లీకి భారీ షాక్.. అక్కడ మ్యాచులు రద్దు.?

ఇండియన్ ఉసేన్ బోల్ట్ అరుదైన ఘనత.. 46 మెడల్స్‌తో ఆల్ టైం రికార్డు..

తెలంగాణలో ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు..

నగరవాసులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో ఈకో ఫ్రెండ్లీ ఫుడ్ జోన్..

కరోనా ఎఫెక్ట్.. దళపతి షాకింగ్ డెసిషన్… అభిమానులకు నిరాశేనా.?