
సాధారణంగా వంట గ్యాస్ సిలిండర్‌ను సంబంధిత గ్యాస్ ఏజెన్సీ దగ్గరకు వెళ్లిగానీ, లేదా ఫోన్ ద్వారా బుకింగ్ చేసుకుంటాం. అయితే ఇకపై వాట్సాప్ నుంచి కూడా గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకునే సదుపాయాన్ని ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) అందుబాటులోకి తీసుకొచ్చింది.
గ్యాస్ బుకింగ్ చేసే ప్రక్రియను కూడా సంస్థ వివరించింది. బీపీసీఎల్ కంపెనీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ నుంచి 1800224344 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చునని సూచించింది. కస్టమర్లకు గ్యాస్ సిలిండర్ బుకింగ్ మరింత సులభతరం చేయాలన్న ఉద్దేశ్యంతోనే ఈ సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని.. మొబైల్ కు వచ్చే లింక్ ను ఓపెన్ చేసి డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో పాటు యూపీఐ చెల్లింపుల ద్వారా పేమెంట్ చేయవచ్చునని బీపీసీఎల్ సంస్థ మార్కెటింగ్ డైరెక్టర్ అరుణ్ సింగ్ వెల్లడించారు. కాగా, బీపీసీఎల్ సంస్థకు ప్రస్తుతం 7.1 కోట్ల మంది ఎల్‌పీజీ వినియోగదారులు ఉన్నారు.