వైట్ హౌస్ వద్దే నల్ల జాతీయుడి ‘స్మృతి చిహ్నం’

అమెరికాలో నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా ఆందోళన చేస్తున్నవారికి మద్దతు ప్రకటిస్తూ.. , వారి 'గౌరవ చిహ్నం' గా  ఓ వీధికే పేరు పెట్టారు.'బ్లాక్ లివ్స్ మ్యాటర్ ప్లాజా'..

వైట్ హౌస్ వద్దే నల్ల జాతీయుడి స్మృతి చిహ్నం

Edited By:

Updated on: Jun 06, 2020 | 11:16 AM

అమెరికాలో నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా ఆందోళన చేస్తున్నవారికి మద్దతు ప్రకటిస్తూ.. , వారి ‘గౌరవ చిహ్నం’ గా  ఓ వీధికే పేరు పెట్టారు.’బ్లాక్ లివ్స్ మ్యాటర్ ప్లాజా’ అనే పేరిట ఈ స్ట్రీట్ ని వ్యవహరించనున్నారు. ఇది అధ్యక్ష భవనం వైట్ హౌస్ వద్దే ఉంది. వాషింగ్టన్ మేయర్ మురియల్ బౌసర్ ఆదేశాలపై ఈ వీధికి ఈ పేరు పెట్టారు. పైగా అక్కడి రోడ్డుమీద పసుపు పచ్చని అక్షరాలతో ఇదే స్లోగన్ లాగా రాయించింది ఆ మేయరమ్మ. సోమవారం రాత్రి శాంతియుతంగా నిరసన తెలిపినవారిని ‘గౌరవించేందుకు’ ఈ వీధికి ఈ పేరు పెట్టినట్టు   మేయర్ స్టాఫ్ చీఫ్ ఒకరు తెలిపారు. నిరసనకారులపై అధ్యక్షుడు ట్రంప్ దాదాపు సైనిక ప్రయోగాన్ని చేపట్టడాన్ని మురియల్ కొన్ని రోజులుగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఆమె అభీష్టానికి వ్యతిరేకంగా అటార్నీ జనరల్ విలియం కూడా పెద్దఎత్తున ఫెడరల్ పోలీసులను, నేషనల్ గార్డ్ యూనిట్లను రంగంలోకి దించుతున్నారు. ‘అమెరికాలో మీరు శాంతియుతంగా నిరసనలు పాటించండి’ అని మురియల్ ఆందోళనకారులకు పిలుపు నిస్తుండగా… అధ్యక్షులవారికి కోపం నషాళానికి ఎక్కుతోంది. ఆమెను ఆయన… అసమర్థురాలని ఏకంగా నేషనల్ గార్డులపైనే ‘పోరాడుతోందని’ దుయ్యబడుతున్నారు.