బీజేపీ నాయకుడి భార్యకు టోకరా.. హ్యాండ్ బ్యాగ్ కొట్టేసిన ఆగంతకుడు

| Edited By:

Jun 25, 2019 | 9:48 AM

ఢిల్లీ బీజేపీ నేత విజేందర్ గుప్తా భార్య శోభా విజేందర్‌కు టక్ టక్ గ్యాంగ్ టోకరా పెట్టారు. శోభా విజేందర్ షాపింగ్ కోసం ఢిల్లీలోని మండీ హౌస్ ప్రాంతానికి కారులో రాగా, గుర్తుతెలియని దుండగుడు కారులోంచి డీజిల్ పోతుందని చెప్పాడు. దీంతో కారులో ఉన్న శోభాతోపాటు కారు డ్రైవరు కిందకు దిగారు. అంతలో కారులో ఉన్న శోభా హ్యాండ్ బాగును ఎత్తుకొని పరారయ్యాడు. దీంతో బాధితురాలు శోభా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు […]

బీజేపీ నాయకుడి భార్యకు టోకరా.. హ్యాండ్ బ్యాగ్ కొట్టేసిన ఆగంతకుడు
Follow us on

ఢిల్లీ బీజేపీ నేత విజేందర్ గుప్తా భార్య శోభా విజేందర్‌కు టక్ టక్ గ్యాంగ్ టోకరా పెట్టారు. శోభా విజేందర్ షాపింగ్ కోసం ఢిల్లీలోని మండీ హౌస్ ప్రాంతానికి కారులో రాగా, గుర్తుతెలియని దుండగుడు కారులోంచి డీజిల్ పోతుందని చెప్పాడు. దీంతో కారులో ఉన్న శోభాతోపాటు కారు డ్రైవరు కిందకు దిగారు. అంతలో కారులో ఉన్న శోభా హ్యాండ్ బాగును ఎత్తుకొని పరారయ్యాడు. దీంతో బాధితురాలు శోభా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.