బిగ్ న్యూస్ బిగ్ డిబేట్.. అజిత్ పవార్ ఎన్సీపీ లీడర్ అవుతాడా..?

ప్రభుత్వం ఏర్పాటుకు తగినంత బలం లేదని చెప్పిన బీజేపీ.. సడన్‌గా రాత్రికి రాత్రి మంతనాలు జరపడమే కాకుండా.. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంలను కూడా ఎన్నుకుని.. గుట్టు చప్పుడు కాకుండా పొద్దున్నే ప్రమాణాలను కూడా కానిచ్చేసింది. గత శుక్రవారం వరకు ఎన్సీపీ, కాంగ్రెస్, సేనలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మంతనాలు జరపడమే కాకుండా.. శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రే‌ను మహారాష్ట్ర సీఎంగా కూడా ప్రకటించారు. అయితే ఎవరూ ఊహించని రీతిలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ బీజేపీకి మద్దతు […]

బిగ్ న్యూస్ బిగ్ డిబేట్.. అజిత్ పవార్ ఎన్సీపీ లీడర్ అవుతాడా..?
Follow us

|

Updated on: Nov 25, 2019 | 11:33 PM

ప్రభుత్వం ఏర్పాటుకు తగినంత బలం లేదని చెప్పిన బీజేపీ.. సడన్‌గా రాత్రికి రాత్రి మంతనాలు జరపడమే కాకుండా.. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంలను కూడా ఎన్నుకుని.. గుట్టు చప్పుడు కాకుండా పొద్దున్నే ప్రమాణాలను కూడా కానిచ్చేసింది. గత శుక్రవారం వరకు ఎన్సీపీ, కాంగ్రెస్, సేనలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మంతనాలు జరపడమే కాకుండా.. శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రే‌ను మహారాష్ట్ర సీఎంగా కూడా ప్రకటించారు. అయితే ఎవరూ ఊహించని రీతిలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ బీజేపీకి మద్దతు ప్రకటించడం.. శనివారం ఉదయం దేవేంద్ర ఫడ్నవీస్ రెండోసారి మహారాష్ట్ర సీఎంగా, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారాలు చేయడం జరిగిపోయింది. అయితే అజిత్ పవార్ పార్టీకి నమ్మకద్రోహం చేశారని.. బీజేపీతో కలిసే ప్రసక్తే లేదని ఎన్సీపీ నేతలు స్పష్టం చేస్తున్నా.. దీని వెనుక స్క్రిప్టెడ్ డ్రామా ఎంతో ఉందని రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా ఈ అంశంపై టీవీ9 వేదికగా బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ జరిగింది.

ఈ నేపథ్యంలో ఫోన్ ద్వారా అందుబాటులోకి వచ్చిన లాయర్ విష్ణువర్ధన్ రెడ్డి పలు ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు. ఎన్సీపీ ఎమ్మెల్యేల మద్దతుపై అజిత్ పవార్ ఇచ్చిన లేఖ చెల్లదంటున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అధికారం లెజిస్లేటివ్ పార్టీ లీడర్ కు మాత్రమే ఉంటుంది. కానీ ఎల్పీ లీడర్ ఇచ్చే సింగిల్ లెటర్ ను గవర్నర్ పరిగణలోకి తీసుకోడానికి  వీల్లేదు. ఎమ్మెల్యేల మద్దతు ఖచ్చితంగా అవసరమవుతుంది. ఇంకా మరిన్ని విషయాలు మహా రాజకీయాల గురించి ఏం చెప్పారో ఆయన మాటల్లోనే…

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?