25వేల మంది శరణార్థులకు ఇళ్ల పట్టాలిస్తున్నాం, దీదీ

వచ్ఛే ఏడాది తమ రాష్ట్రంలో జరగనున్న  అసెంబ్లీ ఎన్నికలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అప్పుడే దృష్టి పెట్టారు. 25 వేలమంది శరణార్థులకు ఇళ్లపట్టాలు ఇస్తున్నట్టు ప్రకటించారు.

25వేల మంది శరణార్థులకు ఇళ్ల పట్టాలిస్తున్నాం, దీదీ
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Nov 05, 2020 | 12:27 PM

వచ్ఛే ఏడాది తమ రాష్ట్రంలో జరగనున్న  అసెంబ్లీ ఎన్నికలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అప్పుడే దృష్టి పెట్టారు. 25 వేలమంది శరణార్థులకు ఇళ్లపట్టాలు ఇస్తున్నట్టు ప్రకటించారు. మొత్తం లక్షా 25 వేల కుటుంబాలు దీనివల్ల లబ్ది పొందుతాయన్నారు. ఎలాంటి షరతులు లేకుండా ఈ పట్టాలిస్తున్నామని, ఈ డాక్యుమెంట్లు ఉంటే చాలు, ఇక వీరు భారతీయులైపోయినట్టేనని ఆమె అన్నారు. ఇదే ప్రూఫ్ అని స్పష్టం చేశారు. . వీరి నుంచి పౌరసత్వాన్ని ఎవరూ లాక్కోజాలరని ఆమె చెప్పారు. హోమ్ మంత్రి అమిత్ షా రెండు రోజుల పర్యటనకు గాను పశ్చిమ బెంగాల్ రావడానికి రెండు రోజులముందే ఆమె శరణార్థులకు ఇళ్ల పట్టాలు ప్రదానం చేయడం విశేషం. 1980 ప్రాంతంలో తాను జాదవ్ పూర్ నుంచి కాంగ్రెస్ ఎంపీగా ఉండగానే శరణార్థుల సమస్యలపై ఎక్కువగా ఆలోచించేదానినని మమత తెలిపారు. రానున్న ఎన్నికల్లో తమ రాష్ట్రంలో బీజేపీ ఇప్పటినుంచే ‘పాగా’ వేయడానికి యత్నించవచ్చునన్న ముందు చూపుతో దీదీ. .. శరణార్ధుల సంక్షేమానికి నడుం కట్టారు.