సైలెంట్ అయిన బలగం బ్యూటీ.. కొత్త సినిమా ఎప్పుడమ్మా..?

Rajeev 

20 September 2024

చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు తెలుగు సినిమాల్లో నటించి మెప్పించింది కావ్య కళ్యాణ్ రామ్. ఇప్పుడు ఈ అమ్మడు హీరోయిన్ అయ్యింది. 

స్నేహమంటే ఇదేరా, గంగోత్రి, ఠాగూర్, అడవి రాముడు, విజయేంద్ర వర్మ, బాలు, బన్నీ, సుభాష్ చంద్ర బోస్, పాండు రంగడు, ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాల్లో చేసింది 

2022లో వచ్చిన మసూద సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కావ్య కల్యాణ్ రామ్. ఈ సినిమాతో హీరోయిన్ గా హిట్ అందుకుంది కావ్య. 

మసుద సినిమా హిట్ అయినప్పటికీ కావ్య రోల్ కు తగిన ప్రాధాన్యం లేకపోవడంతో ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు.

ఆతర్వాత నటుడు వేణు దర్శకత్వంలో తెరకెక్కిన బలగం సినిమాలో కావ్య తన దైన నటనతో ఆకట్టుకుంది.

ఆతర్వాత శ్రీసింహ తో కలిసి ఉస్తాద్ అనే సినిమా చేసింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. 

ఈ సినిమా తర్వాత కావ్య కళ్యాణ్ రామ్ కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు. దాంతో ఈ అమ్మడు ఎక్కడ అంటూ అభిమానులు ఆలోచనలో పడ్డారు.