ఎలా ఉన్న అమ్మాయిని ఎలా మార్చేశావ్ అన్న.. అంటున్న నెటిజన్స్

Rajeev 

20 September 2024

ఇన్ స్టాలో రీల్స్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు వెండితెరకు పరిచయం కాబోతుంది ఆమె ఆరాధ్య దేవి. 

సోషల్ మీడియాలో వెతికి వెతికి మరీ ఆమెను పట్టుకున్నాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడు ఆమెతో సినిమా చేస్తున్నాడు. 

శారీ అనే టైటిల్ తో సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ఆర్జీవీ. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ పిచ్చెక్కిస్తున్నాయి. 

మొన్నటివరకు పద్దతిగా చీరకట్టులో కనిపించిన ఆరాధ్య దేవి ఇప్పుడు ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తుంది. 

శారీ సినిమాలో ఆమె చాలా గ్లామరస్ గా కనిపించనుంది. ఆర్జీవీ హీరోయిన్ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

కానీ వాళ్ళందరిని మించి ఆరాధ్య దేవి తన అందాలతో ఆకట్టుకుంటుంది. ఈ అమ్మడి బోల్డ్ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. 

ఈ బ్యూటీ ఫోటోలు చూసిన నెటిజన్స్.. ఎలాంటి అమ్మాయిని  ఎలా చేశారు సార్ అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.