
మాయదారి కరోనా ఇంకెంత మందిని బలితీసుకుంటుందో తెలియడం లేదు. ఇప్పటికే లక్షలాది మందిని బలిగొన్న కోవిడ్ .. తాజాగా మన క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ క్లోజ్ ఫ్రెండ్ ప్రాణాలను సైతం తీసుకెళ్లింది. సచిన్ టెండూల్కర్‌కు అత్యంత సన్నిహిత స్నేహితుల్లో ఒకడైన విజయ్ షిర్కే కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. కరోనా లక్షణాలతో తానే ఆస్పత్రిలో చేరిన విజయ్ షిర్కే చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
విజయ్ షిర్కే ముంబై జట్టు మాజీ పేసర్. సచిన్‌తో కలిసి చాలా మ్యాచ్‌ల్లో ఆడారు. వినోద్ కాంబ్లీతో కూడా షిర్కే ఆడారు. కళ్యాణ్‌లో పుట్టి పెరిగిన షిర్కే.. ముంబై క్రికెట్ అసోసియేషన్ అండర్ -17 జట్టుకు రెండేళ్ల పాటు కోచ్‌గా వ్యవహరించారు. అయితే కరోనా కారణంగా ఇప్పటి వరకు ఇద్దరి స్నేహితులను సచిన్ కోల్పోయారు.
గత అక్టోబర్ నెలలో టెండూల్కర్ క్లోజ్ ఫ్రెండ్ అవి కదమ్ కూడా కరోనాతో చనిపోయారు. తాజాగా విజయ్ షిర్కే మృతి చెందడంతో సచిన్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.