యూఎస్ఏ జట్టులో చేరిన భారత సంతతి క్రికెటర్..

|

Aug 10, 2020 | 8:32 PM

ఆస్ట్రేలియా జట్టు తరపున అరంగేట్రం చేసిన భారత సంతతి క్రికెటర్ గురిందర్ సంధు తాజాగా అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఆసీస్ తరపున 2015లో 2 వన్డేలు ఆడిన సంధు..

యూఎస్ఏ జట్టులో చేరిన భారత సంతతి క్రికెటర్..
Follow us on

Gurinder Sandhu Joined USA Cricket Team: ఒక దేశంలో పుట్టి.. మరో దేశం తరపున క్రికెట్ ఆడిన ఆటగాళ్లు చాలామందే ఉన్నారు. ప్రస్తుత క్రికెట్ లో ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ దీనికి నిదర్శనం. అతడు ఐర్లాండ్ లో పుట్టి.. ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సరిగ్గా ఇలాగే ఆస్ట్రేలియా జట్టు తరపున అరంగేట్రం చేసిన భారత సంతతి క్రికెటర్ గురిందర్ సంధు తాజాగా అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు.

ఆసీస్ తరపున 2015లో 2 వన్డేలు ఆడిన సంధు.. బిగ్ బాష్ సహా పలు కౌంటీ మ్యాచులు ఆడటమే కాకుండా అద్భుతంగా రాణించాడు. అయితే అతను ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు వదిలి యూఎస్ఏ జట్టులో చేరినట్లు తెలుస్తోంది. ”నా కొత్త క్రికెట్ ప్రయాణం మొదలయ్యింది. ఇది చాలా సంతోషంగా ఉంది. కొత్త జట్టు, కొత్త టీమ్ మేట్స్’ అంటూ ట్వీట్ చేశాడు.

Also Read:

ఎల్ఐసీ పాలసీదారులకు శుభవార్త.. ప్రీమియం చెల్లించని వారికి మరో ఛాన్స్..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వేలిముద్ర లేకుండా పింఛన్ల పంపిణీ..