గడువు ముగిసింది… సారధిగా స్టీవ్ స్మిత్ సిద్దం.!

|

Mar 30, 2020 | 9:19 AM

Australia Cricket: ఆస్ట్రేలియా మాజీ సారధి స్టీవ్ స్మిత్ మళ్ళీ జట్టు పగ్గాలు చేపట్టేందుకు అర్హత సాధించాడు. బాల్ టాంపరింగ్ వివాదంతో క్రికెట్ ఆస్ట్రేలియా అతడిపై ఏడాది పాటు నిషేధం విధించి.. రెండేళ్ళ పాటు కెప్టెన్సీ చేపట్టకుండా ఉండేలా ఆంక్షలు విధించింది. ఇక ఆదివారంతో ఆ గడువు ముగిసింది. దీనితో అతడు మళ్ళీ ఆస్ట్రేలియా కెప్టెన్సీ రేసులోకి వచ్చాడు. స్మిత్‌పై నిషేధం విధించాక ఆసీస్ వన్డే జట్టుకు ఆరోన్ ఫించ్, టెస్టు జట్టుకు టిమ్ పైన్‌లు నాయకత్వం […]

గడువు ముగిసింది... సారధిగా స్టీవ్ స్మిత్ సిద్దం.!
Follow us on

Australia Cricket: ఆస్ట్రేలియా మాజీ సారధి స్టీవ్ స్మిత్ మళ్ళీ జట్టు పగ్గాలు చేపట్టేందుకు అర్హత సాధించాడు. బాల్ టాంపరింగ్ వివాదంతో క్రికెట్ ఆస్ట్రేలియా అతడిపై ఏడాది పాటు నిషేధం విధించి.. రెండేళ్ళ పాటు కెప్టెన్సీ చేపట్టకుండా ఉండేలా ఆంక్షలు విధించింది. ఇక ఆదివారంతో ఆ గడువు ముగిసింది. దీనితో అతడు మళ్ళీ ఆస్ట్రేలియా కెప్టెన్సీ రేసులోకి వచ్చాడు.

స్మిత్‌పై నిషేధం విధించాక ఆసీస్ వన్డే జట్టుకు ఆరోన్ ఫించ్, టెస్టు జట్టుకు టిమ్ పైన్‌లు నాయకత్వం వహిస్తున్నారు. వీరి సారధ్యంలో ఆస్ట్రేలియా రెండు ఫార్మాట్లలో ఫర్వాలేదనిపించింది. ఇక స్మిత్ పునరాగమనం తర్వాత సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. టెస్టుల్లో తిరిగి అగ్రస్థానం సంపాదించుకోవడమే కాకుండా వన్డేలు, టీ20లలో కూడా తనదైన క్లాస్ బ్యాటింగ్‌తో అందరిని ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం కరోనా వైరస్ దాటికి అంతర్జాతీయ మ్యాచ్‌లు అన్ని ఆగిపోగా.. విరామం తర్వాత జరిగే తొలి సిరీస్‌కు స్మిత్ జట్టు పగ్గాలు చేపట్టే అవకాశం లేకపోలేదు.

మరోవైపు ఈ ఏడాది అక్టోబర్‌లో ఇండియా ఆస్ట్రేలియా పర్యటన చేయాల్సి ఉండగా.. ఆ టూర్ కాస్తా క్యాన్సిల్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆరు నెలల పాటు అంతర్జాతీయ విమానాల రాకపోకల్ని ఆపేసింది. కాగా, అక్టోబర్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ సైతం పరిస్థితులు బట్టి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇది చదవండి: గుడ్ న్యూస్.. ఏపీలో కోలుకున్న మరో కరోనా బాధితుడు..