ఈ నెల 8న బ్యాంకులు, ఏటీఎంలు బంద్.. ఎందుకో తెలుసా.?

|

Jan 04, 2020 | 2:31 PM

మోదీ సర్కార్ అనుసరిస్తున్న కార్మిక విధానాలకు నిరసనగా బ్యాంకు యూనియన్లు మరోసారి సమ్మెబాట పట్టనున్నాయి. ఈ నెల 8వ తేదీన దేశవ్యాప్త సమ్మెకు సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు పిలుపునిస్తూ.. ఆ రోజున బ్యాంకు ఉద్యోగులు విధులను బహిష్కరించాలని బ్యాంకింగ్ సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోషియేషన్ (ఏఐబీఈఏ), బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఈఎఫ్ఐ) ప్రకటించాయి. దీంతో ఆ రోజున దేశవ్యాప్తంగా బ్యాంకులు, ఏటీఎంలు బంద్ కానున్నాయి. అయితే ఆన్లైన్ బ్యాంకింగ్ […]

ఈ నెల 8న బ్యాంకులు, ఏటీఎంలు బంద్.. ఎందుకో తెలుసా.?
Follow us on

మోదీ సర్కార్ అనుసరిస్తున్న కార్మిక విధానాలకు నిరసనగా బ్యాంకు యూనియన్లు మరోసారి సమ్మెబాట పట్టనున్నాయి. ఈ నెల 8వ తేదీన దేశవ్యాప్త సమ్మెకు సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు పిలుపునిస్తూ.. ఆ రోజున బ్యాంకు ఉద్యోగులు విధులను బహిష్కరించాలని బ్యాంకింగ్ సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోషియేషన్ (ఏఐబీఈఏ), బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఈఎఫ్ఐ) ప్రకటించాయి.

దీంతో ఆ రోజున దేశవ్యాప్తంగా బ్యాంకులు, ఏటీఎంలు బంద్ కానున్నాయి. అయితే ఆన్లైన్ బ్యాంకింగ్ సర్వీసులకు మాత్రం ఎటువంటి ఆటంకం ఉండదు. బ్యాంకుల విలీనం, సంస్కరణలు, ఉద్యోగుల జీతభత్యాల పెంపు వంటి అంశాలపై ఈ సమ్మె చేపడుతున్నామని ఏఐబీవోసీ జనరల్ సెక్రటరీ సౌమ్య దత్త తెలిపారు.

అంతేకాకుండా వారానికి ఐదు రోజుల పని దినాలు, ఏప్రిల్ 2010 తర్వాత చేరిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్‌ లభించకపోవడం వంటి సమస్యలపై బ్యాంకు యూనియన్లు సమ్మెకు దిగుతుంటే.. దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.