కశ్మీర్ కల్లోలం.. అమరుడైన జవాన్

గురువారం జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఎన్ కౌంటర్‌లో గాయపడ్డ ఆర్మీ జవాన్ అమరుడయ్యాడు. రోహిత్ కుమార్ యాదవ్ అనే జవాన్ గురువారం షోపియాన్ జిల్లాలో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే భద్రతా సిబ్బంది ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. అయితే ఇవాళ ఉదయం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. షోపియాన్‌ జిల్లాలోని హన్‌దేవ్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. వీరి రాకను గుర్తించిన ముష్కరులు కాల్పులకు తెగబడడంతో బలగాలు […]

కశ్మీర్ కల్లోలం.. అమరుడైన జవాన్

Updated on: May 17, 2019 | 1:37 PM

గురువారం జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఎన్ కౌంటర్‌లో గాయపడ్డ ఆర్మీ జవాన్ అమరుడయ్యాడు. రోహిత్ కుమార్ యాదవ్ అనే జవాన్ గురువారం షోపియాన్ జిల్లాలో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే భద్రతా సిబ్బంది ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. అయితే ఇవాళ ఉదయం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు.

షోపియాన్‌ జిల్లాలోని హన్‌దేవ్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. వీరి రాకను గుర్తించిన ముష్కరులు కాల్పులకు తెగబడడంతో బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఆ సమయంలో రోహిత్ తీవ్ర గాయాలపాలయ్యాడు. కాగా, భద్రతా దళాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

Loading...
Unable to load recommendations.
Follow Us