వారం రోజుల్లోగా ఏపీ భవనాల అప్పగింత

|

Jun 10, 2019 | 4:04 PM

తెలంగాణ సీఎస్‌తో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఏపీ తరపున ప్రేమ్ చంద్రారెడ్డి, తెలంగాణ తరపున రామకృష్ణారావు హాజరయ్యారు. ఏపీ భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించడం పై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. సచివాలయ భవనాలను తెలంగాణ జీఏడీకి, అసెంబ్లీ భవనాలను తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శికి.. ఎమ్మెల్యేల క్వార్టర్లను ఎస్టేట్ ఆఫీసర్‌కు అప్పగించాలని నిర్ణయించారు. వారం రోజుల్లోగా భవనాల అప్పగింత పూర్తికానున్నట్లు సమాచారం. ఇక తర్వాత ఏపీ భవనాల్లోకి తెలంగాణ సచివాలయాన్ని తరలించనున్నారు. ఈనెల 27లోగా కొత్త సచివాలయ […]

వారం రోజుల్లోగా ఏపీ భవనాల అప్పగింత
Follow us on

తెలంగాణ సీఎస్‌తో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఏపీ తరపున ప్రేమ్ చంద్రారెడ్డి, తెలంగాణ తరపున రామకృష్ణారావు హాజరయ్యారు.
ఏపీ భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించడం పై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. సచివాలయ భవనాలను తెలంగాణ జీఏడీకి, అసెంబ్లీ భవనాలను తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శికి.. ఎమ్మెల్యేల క్వార్టర్లను ఎస్టేట్ ఆఫీసర్‌కు అప్పగించాలని నిర్ణయించారు. వారం రోజుల్లోగా భవనాల అప్పగింత పూర్తికానున్నట్లు సమాచారం. ఇక తర్వాత ఏపీ భవనాల్లోకి తెలంగాణ సచివాలయాన్ని తరలించనున్నారు. ఈనెల 27లోగా కొత్త సచివాలయ భవనానికి సీఎం కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు. మరో 3 నెలల వరకు మంచి రోజులు లేవన్న కారణంతో తెలంగాణ ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది.