ఏపీలో రేపే ఇంటర్ ఫలితాలు…

ఏపీలో రేపు (శుక్రవారం) ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ల పరీక్షల ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ ఫలితాలను రేపు మధ్యాహ్నం 12. 30కు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించనున్నారు.

ఏపీలో రేపే ఇంటర్ ఫలితాలు...

Updated on: Jun 11, 2020 | 2:54 PM

ఏపీలో రేపు (శుక్రవారం) ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ల పరీక్షల ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ ఫలితాలను రేపు మధ్యాహ్నం 12. 30 తర్వాత విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించనున్నారు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఆలస్యమైన జవాబు పత్రాల మూల్యాంకనం ఇంటర్ బోర్డు అధికారులు ఎట్టకేలకు పూర్తి చేశారు. దీనితో రేపు ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేయనుంది. మార్చి 4 నుంచి 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ ఎగ్జామ్స్ జరిగిన సంగతి విదితమే. కాగా, ఏపీలో పదో తరగతి పరీక్షలు జులై 10 నుంచి 15వ తేదీ వరకూ జరగనున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us