ఏపీ కొత్త సీఎస్‌పై ఊహాగానాలు.. పోటీలో నలుగురు సీనియర్ అధికారులు.. టాప్ ప్లేస్‌లో ఉన్నది మాత్రం ఆయనే..!

ఏపీకి కొత్త సీఎస్‌పై ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నెలాఖరుతో నీలం సాహ్నీ పదవీ కాలం ముగుస్తుండటంతో కొత్త సీఎస్ ఎవరనే అంశంపై చర్చ మొదలైంది. ఈ రేసులో..

  • Sanjay Kasula
  • Publish Date - 7:10 am, Fri, 11 December 20
ఏపీ కొత్త సీఎస్‌పై ఊహాగానాలు.. పోటీలో నలుగురు సీనియర్ అధికారులు.. టాప్ ప్లేస్‌లో ఉన్నది మాత్రం ఆయనే..!
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కరోనా కలకలం

ఏపీకి కొత్త సీఎస్‌పై ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నెలాఖరుతో నీలం సాహ్నీ పదవీ కాలం ముగుస్తుండటంతో కొత్త సీఎస్ ఎవరనే అంశంపై చర్చ మొదలైంది. ఈ రేసులో ఆదిత్యనాథ్‌ దాస్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.. ఆయన వైపే ముఖ్యమంత్రి జగన్‌ మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.

సాధారణంగా ప్రస్తుత సీఎస్‌ పదవీ కాలం ముగిసే రోజు కొత్త సీఎస్‌ నియామక ఉత్తర్వులు వెలువడతాయి. ఆ దిశగా కొన్ని మార్పులు జరగబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్‌ దాస్‌ను సీఎస్‌ కార్యాలయంలో ఓఎస్డీగా నియమిస్తున్నట్లు తెలుస్తోంది. నెలాఖరు వరకూ ఓఎస్డీగా ఉంటూ పాలనా వ్యవహారాలపై అవగాహన పెంచుకోడానికి ఈ ఏర్పాట్లు చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఎవరిని ఈ కీలక పదవి దక్కనుందో వేచి చూడాలి.