కొత్త లక్షణం: కరోనా సోకినవారిలో వినికిడి లోపం.!

|

Aug 02, 2020 | 12:20 PM

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ లక్షణాల గురించి మరో షాకింగ్ న్యూస్‌ వెలుగులోకి వచ్చింది. కోవిడ్ సోకినవారిలో కొత్త లక్షణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

కొత్త లక్షణం: కరోనా సోకినవారిలో వినికిడి లోపం.!
Follow us on

Another Effect of COVID 19: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ లక్షణాల గురించి మరో షాకింగ్ న్యూస్‌ వెలుగులోకి వచ్చింది. కోవిడ్ సోకినవారిలో కొత్త లక్షణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ మహమ్మారి నుంచి కోలుకున్నవారిలో కొత్తగా వినికిడి లోపంతో పాటు టిన్నిటస్ వంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి.

కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన ఎనిమిది వారాల తర్వాత చాలామంది వినికిడి శక్తిని కోల్పోయినట్లుగా వైద్యులు గుర్తించారు. మాంచెస్టర్ యూనివర్సిటీ ఆడియాలజిస్టులు, ఎన్‌ఐహెచ్‌ఆర్‌ మాంచెస్టర్ బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్ కలిసి చేసిన అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైంది. అటు రుచి, వాసన కోల్పోవడం వంటి సమస్యలు కూడా కరోనా రోగుల్లో అధికమవుతున్నాయని వైద్యులు తెలిపారు. వినికిడి, ఆడియో వెస్టిబ్యులర్ వ్యవస్థపై కోవిడ్ 19 ప్రభావం ఎంతవరకు ఉంటుందన్న దానిపై పరిశోధనలు జరపాలని శాస్త్రవేత్తలు తెలిపారు.

మాంచెస్టర్ యూనివర్సిటీ ఆడియాలజిస్టుల అధ్యయనం ప్రకారం.. మొత్తం 121 కరోనా రోగులతో వారు ఫోన్ సర్వే నిర్వహించి పలు కీలక అంశాలపై ప్రశ్నించారు. మీలో ఎవరికైనా వినికిడిలో మార్పులు చోటు చేసుకున్నాయా అని అడిగినప్పుడు.. సుమారు 16 మంది(13.2 శాతం) వినికిడి శక్తిని పూర్తిగా కోల్పోయామని చెప్పగా.. మరో ఎనిమిది మంది వినికిడి క్షీణత దిగజారిందని తెలిపారు. ఫేస్ మాస్క్ ధరించడం, కరోనా చికిత్సకు వినియోగించిన మందులు.. వినికిడి వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించి అనారోగ్య సమస్యలకు దారి తీస్తున్నాయని నిపుణులు హెచ్చరించారు. కాగా, కరోనా పేషంట్లలో జలుబు, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, వాసనలు పసిగట్టలేకపోవడం, రుచి చూడలేకపోవడం, వికారం లేదా వాంతులు, డయేరియా, ముక్కు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయన్న సంగతి తెలిసిందే.

Also Read: దశాబ్దాల పాటు కరోనాతో యుద్ధం చేయాల్సిందే.. డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక..