Tiger Shroff and Disha Patani Dating : క్లారిటీ వచ్చేసింది..టైగర్‌, దిశాల రిలేషన్‌పై అనిల్ కపూర్ ఆసక్తికర కామెంట్

చాలా రోజులుగా కలిసి తిరుగుతున్నా.. తమ రిలేషన్‌ గురించి ఇంతవరకు ఓపెన్ అవ్వలేదు టైగర్ ష్రాఫ్‌, దిశా పఠాని. బాలీవుడ్‌లో హాటెస్ట్ కపుల్‌గా పేరున్న ఈ జోడి.. సినిమాల విషయంలోనూ ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారు.

Tiger Shroff and Disha Patani Dating :  క్లారిటీ వచ్చేసింది..టైగర్‌, దిశాల రిలేషన్‌పై అనిల్ కపూర్ ఆసక్తికర కామెంట్

Updated on: Jan 05, 2021 | 11:26 AM

Tiger Shroff and Disha Patani Dating :  చాలా రోజులుగా కలిసి తిరుగుతున్నా.. తమ రిలేషన్‌ గురించి ఇంతవరకు ఓపెన్ అవ్వలేదు టైగర్ ష్రాఫ్‌, దిశా పఠాని. బాలీవుడ్‌లో హాటెస్ట్ కపుల్‌గా పేరున్న ఈ జోడి.. సినిమాల విషయంలోనూ ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారు. ఇక వీకెండ్‌ పార్టీలు.. ఫ్యామిలీ సెలబ్రేషన్స్‌ లోనూ కలిసి కనిపిస్తుంటారు.. అయినా ఇద్దరి మధ్య సమ్‌థింగ్, సమ్‌థింగ్ అన్న క్వశ్చన్‌కు మాత్రం ఆన్సర్ చెప్పరు. దిశ, టైగర్‌ల రిలేషన్ విషయంలో ఓ సీనియర్‌ స్టార్‌ హీరో క్లారిటీ ఇచ్చేశారు. చెప్పీ చెప్పనట్టుగా అసలు విషయం చెప్పేశారు. ఏకే వర్సెస్‌ ఏకే ప్రమోషన్‌లో మీడియాతో మాట్లాడిన అనిల్‌ కపూర్ ఆ సీక్రెట్‌ను రివీల్ చేశారు. మీరు ఎవరి డైట్‌ప్లాన్ అయినా దొంగిలించారా..? అన్న క్వశ్చన్‌కు క్రేజీ ఆన్సర్‌ ఇచ్చారు అనిల్ కపూర్‌.

టైగర్ పేరును.. చెప్పీ చెప్పనట్టుగా చెప్పి.. వెంటనే దిశ పటాని డైట్‌ ప్లాన్‌ను దొంగిలించా అంటూ స్మైల్ ఇచ్చారు అనిల్‌ కపూర్‌. గతంలో ఈ మూవీ ప్రమోషన్ ఈవెంట్‌లోనూ ఇలాగే దిశాను టీజ్ చేశారు అనిల్‌ కపూర్‌. ఈ ఇన్సిడెంట్స్‌ తో దిశ, టైగర్‌ల రిలేషన్‌ విషయంలో క్లారిటీ వచ్చినట్టే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

Also Read :

 జంగారెడ్డిగూడెంలో హృదయ విదారక ఘటన.. తల్లి మృతదేహంతోనే ఐదు రోజులు జీవనం

భర్త స్నేహితుడితో సాన్నిహిత్యం..కట్టుకున్నవాడిని చంపించిన వైనం..గుత్తిలో దారుణం