ఏపీలో టెలిఫోన్‌ ట్యాపింగ్‌ ప్రకంపనలు

నిత్యం ఏదో ఒక అంశం తెరమీదకు వచ్చి అధికార, విపక్షాల మధ్య రాజకీయయుద్ధం జరుగుతున్న ఏపీలో తాజాగా టెలిఫోన్‌ ట్యాపింగ్‌ చిచ్చు రేగింది. ఫోన్ ట్యాపింగ్ అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబుకు డీజీపీ లేఖ రాసిన విషయం తెలిసిందే. కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు కానీ.. ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు ఏపీ పోలీసు అధికారులు.

ఏపీలో టెలిఫోన్‌ ట్యాపింగ్‌ ప్రకంపనలు
Follow us

|

Updated on: Aug 23, 2020 | 12:26 PM

నిత్యం ఏదో ఒక అంశం తెరమీదకు వచ్చి అధికార, విపక్షాల మధ్య రాజకీయయుద్ధం జరుగుతున్న ఏపీలో తాజాగా టెలిఫోన్‌ ట్యాపింగ్‌ చిచ్చు రేగింది. ఫోన్ ట్యాపింగ్ అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబుకు డీజీపీ లేఖ రాసిన విషయం తెలిసిందే. కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు కానీ.. ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు ఏపీ పోలీసు అధికారులు. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885, IT చట్టం 2000 ఉల్లంఘించిన వారి వివరాలు అందచేయాలని లేఖలో కోరారు డీజీపీ. చట్టాన్ని బ్రేక్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారాయన. రైట్ ఆఫ్ ప్రైవసీకి కట్టుబడి ఉన్నామని ప్రజల హక్కులు కాపాడ్డానికి సహకరించాలని చంద్రబాబును కోరారు డీజీపీ గౌతమ్ సవాంగ్.

ఏపీలో మరోసారి టెలిఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజ్యాంగ వ్యవస్థలను కాలరాస్తూ.. ట్యాపింగ్‌ చేస్తున్నారని.. దీనిపై జోక్యం చేసుకోవాల్సిన అసవరం ఉందని ప్రధానికి లేఖ రాశారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. ఫోన్‌ ట్యాపింగ్‌ వివాదంపై అటు ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు కూడా ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. ఏపీలో ప్రతిపక్షాలు, న్యాయమూర్తులు, కీలక వ్యక్తుల ఫోన్లు ట్యాప్‌ అవుతున్నాయన్నారు చంద్రబాబు. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని.. టెలిఫోన్‌ ట్యాపింగ్‌పై విచారణకు ఆదేశించాలన్నారు చంద్రబాబు. ఆ అవసరం తమకు లేదంటోంది వైసీసీ. అదే సమయంలో నిరాధార ఆరోపణలు చేసిన వారికి నోటీసులు ఇచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది. గతంలో టీడీపీ అధికారంలోకి ఉండగా.. వైసీపీ కూడా టెలిఫోన్‌ ట్యాపింగ్‌ జరుగుతుందని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. కోర్టులో కేసులు వేసింది. టెలిగ్రాఫ్‌ యాక్ట్‌ 5 ఆఫ్ 2 ప్రకారం టెలిఫోన్‌ ట్యాపింగ్‌ చేయడానికి మార్గదర్శకాలున్నాయి. అయినా ఏదో రాష్ట్రంలో వివాదం వినిపిస్తూనే ఉంది. రాజకీయంగా దుమారం రేపుతూనే ఉన్నాయి.

మరోవైపు ఇటీవల న్యాయమూర్తుల టెలిఫోన్లు ట్యాప్‌ అవుతున్నాయన్న ప్రచారం జరిగింది. దీనిపై కొందరు కోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగ వ్యవస్థలపై దాడి అని.. దీనిని వెంటనే విచారణకు స్వీకరించాలని లాయర్‌ శ్రవణ్‌కుమార్‌ హైకోర్టును కోరారు. పిటిషన్ స్వీకరించిన కోర్టు మంగళవారం విచారణ చేపడతామంది. ఈ వివాదం ఇలా ఉండగా.. తన రెండు ఫోన్లు ట్యాప్‌ అవుతున్నాయని చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లాకు లేఖ రాశారు ఎంపీ రఘురామకృష్ణంరాజు. రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్‌ 21కు విరుద్దంగా ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు.

టెలిఫోన్‌ ట్యాపింగ్‌ వివాదాలు కొత్తకాదు.. గతంలోనూ చంద్రబాబు ప్రభుత్వంపై వైసీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఇంటిలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు విదేశాల నుంచి ట్యాపింగ్‌ ఎక్విప్‌మెంట్‌ తీసుకొచ్చి మరీ ట్యాపింగ్‌కు పాల్పడినట్టు ఆరోపించింది. కేసులు కూడా దాఖలు చేసింది. ఇటీవల కర్నాటక, మహారాష్ట్ర, రాజస్తాన్‌లోనూ టెలిఫోన్‌ ట్యాపింగ్‌లపై రాజకీయ విమర్శలు.. ప్రతివిమర్శలు చోటుచేసుకున్నాయి. అంతకుమందు 1988లో టెలిఫోన్‌ ట్యాపింగ్‌ విమర్శలతో కర్నాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెడ్గే కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. చట్టానికి ఎంతపదునుందో… పార్టీలు అంత సులభంగా రాజకీయాలు చేస్తున్నాయి. ఆరోపణలు బయటపడ్డవి తక్కువ.. విమర్శలకు పరిమితం అయినవి ఎక్కువ. మరోసారి ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్న టెలిఫోన్‌ ట్యాపింగ్‌ అంశం ఎక్కడకు దారి తీస్తుందో చూద్దాం.