
Anasuya Comments On Item Song: యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టి.. వెండి తెరపై తళుక్కుమంటోంది అందాల యాంకర్ అనసూయ. ఓవైపు యాంకర్‌గా కొనసాగుతూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ సత్తా చాటుతున్నారు. ఇదిలా ఉంటే ఈ ముద్దుగుమ్మ తాజాగా చావు కబురు చల్లగా చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించింది. ‘పైన పటారం.. లోన లొటారం’ అనే సాంగ్‌లో తనదైన డ్యాన్స్‌తో ఆకట్టుకుంది.
ఇదిలా ఉంటే తాజాగా అనసూయ ట్విట్టర్ వేదికగా ఈ పాటపై ఓ నెటిజెన్‌కు క్లాస్ పీకింది. వివరాల్లోకి వెళితే.. ‘పైన పటారం.. లోన లొటారం’ పాట యూట్యూబ్ లింక్‌ను పోస్ట్ చేసిన ఓ నెటిజెన్.. ‘ఐటెం సాంగ్‌ను చేయను అన్నారు కదా. మరి ఇదేంటి అండి. అయినా ఆ లిరిక్స్ ఏంటి’ అంటూ కామెంట్ పెట్టాడు. దీంతో చిర్రెత్తుకుపోయిన అనసూయ సదరు నెటిజెన్‌కు క్లాస్ పీకారు. సదరు వ్యక్తి ట్వీట్‌కు స్పందిస్తూ.. ‘హల్లో.. అది ఐటెం సాంగ్ కాదు. అసలు ‘ఐటెం’ సాంగ్ అనేది ఏదీ లేదమ్మ.. ఒక పాటకు ఉన్న క్యాస్ట్ కాకుండా స్పెషల్‌గా ఎవరైనా కావాలి అనుకున్నప్పుడు స్పెషల్ సాంగ్ వస్తుంది. ఒకప్పుడు అమ్మాయిని వస్తువుగా ట్రీట్ చేసేవాళ్లు.. ఇచ్చిన పేరు అది. అంతేకాకుండా.. ఆ లిరిక్స్ వల్లే నేను ఈ స్పెషల్ సాంగ్ ఒప్పుకున్నాను’ అంటూ సమాధానం ఇచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే కార్తికేయ, లావణ్యా త్రిపాఠి జంటగా నటించిన ‘చావు కబురు చల్లగా’ చిత్రంతో పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. బన్నీవాసు నిర్మాతగా జీఏ2 పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ఈనెల 19న విడుదల చేయనున్నారు.
Also Read: పవన్ కళ్యాణ్‌కు నాలుగో భార్యగా ఉంటాను.. ఆషూరెడ్డి దిమ్మతిరిగే సమాధానం.. ట్వీట్ వైరల్.!