టీమిండియా భవిష్యత్తు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్.. వ్యక్తిగత ప్రదర్శనను అసలు పట్టించుకోడు.!

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌పై సహచర ఆటగాడు అలెక్స్ కేరీ ప్రశంసలు కురిపించాడు. వ్యక్తిగత ప్రదర్శనల మీద కంటే జట్టు...

టీమిండియా భవిష్యత్తు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్.. వ్యక్తిగత ప్రదర్శనను అసలు పట్టించుకోడు.!

Updated on: Nov 18, 2020 | 4:55 PM

Alex Carey Comments: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌పై సహచర ఆటగాడు అలెక్స్ కేరీ ప్రశంసలు కురిపించాడు. వ్యక్తిగత ప్రదర్శనల మీద కంటే జట్టు ఫలితాలపైనే శ్రేయాస్ ఎక్కువగా దృష్టి సారిస్తాడని.. భవిష్యత్తులో భారత జట్టును నడిపించే సామర్ధ్యం అతనిలో పుష్కలంగా ఉందని పేర్కొన్నాడు.

”ఐపీఎల్‌లో ఢిల్లీ జట్టును శ్రేయాస్ ఎంతో సమర్ధవంతంగా నడిపిస్తున్నాడు. భవిష్యత్తులో అతడు తప్పకుండా భారత్ జట్టుకు కెప్టెన్ కాగలడు. జట్టులోని సహచర ఆటగాళ్లకు కావాల్సినంత సమయం ఇస్తూ.. వారిలోని ప్రతిభను వెలికితీస్తాడు. మరీ ముఖ్యంగా వ్యక్తిగత ప్రదర్శనపై ఎక్కువగా దృష్టి పెట్టడు. కేవలం జట్టు ఫలితాల గురించే ఆలోచిస్తాడు. అతడో అద్భుతమైన నాయకుడు. కోచ్ రికీ పాంటింగ్‌తో కలిసి అతడి భాగస్వామ్యం బాగుంటుంది” అని అలెక్స్ క్యారీ పేర్కొన్నాడు. కాగా, ఈ ఏడాది ఐపీఎల్‌ ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై చేతిలో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

Also Read:

ఐపీఎల్ 2021: మారనున్న టీమ్స్ రూపురేఖలు.. మెగా ఆక్షన్‌లోకి ధోని, స్మిత్, విలియమ్సన్‌లు వచ్చే అవకాశం..

ధోనిని వదులుకోవడమే బెటర్.. సీఎస్‌కేకు ఆకాష్ చోప్రా ఉచిత సలహా..!