ఉగ్రవాదుల దుశ్చర్య.. 9మంది వైద్యుల కాల్చివేత

ఓ వైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఇదే సమయంలో ఉగ్రవాదులు తెగబడుతున్నారు. అనారోగ్యంతో బాధపడే ఎంతో మందికి ఆపదలో దేవుడిలా చికిత్స అందించే వైద్యుల ప్రాణాలను కూడా కడతేర్చుతున్నారు. తాజాగా సోమాలియాలో జరిగిన ఓ సంఘటన కలకలం రేపుతోంది. అల్‌ఖైదా అనుబంధ సంస్థ అయిన అల్‌ షబాబ్‌ గ్రూప్‌కు చెందిన ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టారు. సౌత్ సోమాలియాకు చెందిన ఈ ఉగ్రవాదులు.. తొమ్మిది మంది డాక్టర్లను కిడ్నాప్‌ చేశారు. ఆ […]

ఉగ్రవాదుల దుశ్చర్య.. 9మంది వైద్యుల కాల్చివేత

Edited By:

Updated on: May 29, 2020 | 12:45 PM

ఓ వైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఇదే సమయంలో ఉగ్రవాదులు తెగబడుతున్నారు. అనారోగ్యంతో బాధపడే ఎంతో మందికి ఆపదలో దేవుడిలా చికిత్స అందించే వైద్యుల ప్రాణాలను కూడా కడతేర్చుతున్నారు. తాజాగా సోమాలియాలో జరిగిన ఓ సంఘటన కలకలం రేపుతోంది. అల్‌ఖైదా అనుబంధ సంస్థ అయిన అల్‌ షబాబ్‌ గ్రూప్‌కు చెందిన ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టారు. సౌత్ సోమాలియాకు చెందిన ఈ ఉగ్రవాదులు.. తొమ్మిది మంది డాక్టర్లను కిడ్నాప్‌ చేశారు. ఆ తర్వాత వారిని కాల్చి చంపేశారు. దేశంలోని మిడిల్‌ షాబెల్లీ ప్రావిన్స్‌ ప్రాంతంలోని బలాద్‌ నగరంలో ఈ తొమ్మిది మంది డాక్టర్ల డెడ్‌ బాడీస్ దర్శనమిచ్చాయి. వీరంతా యువ డాక్టర్లని గుర్తించారు. స్థానిక ఆస్పత్రుల్లో వీరంతా ఉద్యోగం చేసేవారని అధికారులు తెలిపారు. కాగా, సోమాలియా దేశంలో 1990 నుంచి ఉగ్రవాదుల ఆగడాలు.. స్థానిక ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us