మెర్లపాక గాంధీ డైరెక్షన్‌లో నితిన్ కొత్త సినిమా… దుబాయ్‌లో ప్రారంభమైన షూటింగ్

|

Dec 06, 2020 | 8:36 PM

యంగ్ హీరో నితిన్ వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. ఈ ఏడాది భీష్మ సినిమాతో మంచి విజయం అందుకున్న నితిన్ అదే జోష్ లో రంగ్ డే సినిమా చేస్తున్నాడు.

మెర్లపాక గాంధీ డైరెక్షన్‌లో నితిన్ కొత్త సినిమా... దుబాయ్‌లో ప్రారంభమైన షూటింగ్
Follow us on

యంగ్ హీరో నితిన్ వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. ఈ ఏడాది భీష్మ సినిమాతో మంచి విజయం అందుకున్న నితిన్ అదే జోష్ లో రంగ్ డే సినిమా చేస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో జరుగుతుంది.

ఈ సినిమాతో పాటు మెర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు నితిన్. బాలీవుడ్ లో ఆయుష్మాన్ ఖురానా న‌టించిన అంధాధున్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. నితిన్ కెరియర్ లో 30వ సినిమాగా వస్తున్న ఈ చిత్రంలో ఇస్మార్ట్ బ్యూటీ న‌భాన‌టేశ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ తాజాగా దుబాయ్ లో ప్రారంభమైంది. నితిన్‌, న‌భా న‌టేష్‌పై దుబాయ్‌లో స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. శ్రేష్ఠ్ మూవీస్ బ్యాన‌ర్‌పై వ‌స్తోన్న‌ ప్రొడ‌క్ష‌న్ నంబ‌ర్ 6ను ఎన్‌. సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి సినిమాను నిర్మిస్తున్నారు. మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో త‌మ‌న్నా కీల‌క పాత్ర లో కనిపించనుంది. జ‌న‌వ‌రి నుంచి జ‌రిగే త‌దుప‌రి షెడ్యూల్ షూటింగ్‌లో తమ‌న్నా పాల్గొన‌నుందని సమాచారం. ‌