Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ క్వీన్ కంగనాకు ముంబై హైకోర్టు లో చుక్కెదురు.. నెక్స్ట్ ఏంటి ?

|

Jun 16, 2021 | 3:36 PM

Actor Kangana Ranaut: బాలీవుడ్ క్వీన్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కు మళ్ళీ కొత్త చిక్కులొచ్చాయి. ఈ ఫైర్ బ్రాండ్ కు పాస్ పోర్ట్ విషయంలో కోర్టు లో చుక్కెదురైంది. కంగనా పాస్ పోర్ట్..

Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ క్వీన్ కంగనాకు ముంబై హైకోర్టు లో చుక్కెదురు.. నెక్స్ట్ ఏంటి ?
kangana
Follow us on

Actor Kangana Ranaut: బాలీవుడ్ క్వీన్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కు మళ్ళీ కొత్త చిక్కులొచ్చాయి. ఈ ఫైర్ బ్రాండ్ కు పాస్ పోర్ట్ విషయంలో కోర్టు లో చుక్కెదురైంది. కంగనా పాస్ పోర్ట్ రెన్యువల్ విషయంలో పోలీసుల నుంచి ఎదురైన ఇబ్బందులు ఇప్పట్లో తీరేలా లేవు. దేశ ద్రోహం కేసును ఎదుర్కొంటున్న నేపథ్యంలో పాస్ పోర్ట్ రెన్యూవల్ లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఈ క్వీన్. దీంతో ముంబై హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును ఈ నెల 25కు వాయిదా వేసింది.

కంగనా ఈ నెలలో షూటింగ్ నిమిత్తం హంగేరిలోని బుడాపెస్ట్‌కు వెళ్లాల్సి ఉంది. . ఈ నెల 15నుంచి ఆగస్టు 30 వరకు చిత్ర యూనిట్ షెడ్యూల్‌ ప్లాన్‌ చేశారు. ఆమె పాస్‌ పోర్టు గడువు సెప్టెంబర్‌ 15న ముగియనుంది. ఈ నేపథ్యంలో పస పోర్ట్ రెన్యూవల్ చేయాలనీ అధికారులను కంగనా కోరింది. కంగనా పై పోలీస్ కేసు ఉన్నందున తాము రెన్యూవల్ చేయలేమని అధికారులు చెప్పారు. ఎందుకంటే ఎవరికైనా పాస్ట్ పోర్ట్ రెన్యువల్‌ చేయాలంటే పోలీస్‌ వెరిఫికేషన్‌ తప్పనిసరి. కాగా ఆ మధ్య బాంద్రా పోలీస్‌ స్టషన్‌లో ఆమెపై దేశద్రోహం కేసు నమోదై ఉంది. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ పాస్ పోర్ట్ రెన్యూవల్ చేయడనికి అధికారులు అభ్యంతరం చెబుతున్నారు.

ఖాన్ హీరోల సినిమాలను సైతం నో చెప్పే ఫైర్ బ్రాండ్ మంచి నటి.. బాలీవుడ్ లో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈ బీ టౌన్ బ్యూటీ తెలుగులోనూ ప్రభాస్ పక్కన హీరోయిన్ గా ఏ నిరంజన్ సినిమాలో నటించింది.

Also Read: యాపిల్ కంటే ఐదు రెట్లు పోషకాలు కలిగిన ఈ పండు తింటే ప్రయోజనాలు ఎన్నో