చెల్లిని కాపాడ్డానికి కుక్క‌తో అన్న పోరాటం..ప్రపంచ బాక్సింగ్​ ఛాంప్​గా ఘనత

అమెరికాలోని వ్యోమింగ్​కు చెందిన బ్రిడ్జ​ర్ వాకర్​ అనే ఆరేళ్ల చిన్నోడు ఇప్పుడు ఇంట‌ర్నెట్ లో సెన్సేష‌న్ మారాడు. ఇతడు చేసిన ఓ ప‌ని తెలిస్తే మీరు కూడా మెచ్చుకోకుండా ఉండరు.

చెల్లిని కాపాడ్డానికి కుక్క‌తో అన్న పోరాటం..ప్రపంచ బాక్సింగ్​ ఛాంప్​గా ఘనత
Follow us

|

Updated on: Jul 17, 2020 | 7:41 AM

అమెరికాలోని వ్యోమింగ్​కు చెందిన బ్రిడ్జ​ర్ వాకర్​ అనే ఆరేళ్ల చిన్నోడు ఇప్పుడు ఇంట‌ర్నెట్ లో సెన్సేష‌న్ మారాడు. ఇతడు చేసిన ఓ ప‌ని తెలిస్తే మీరు కూడా మెచ్చుకోకుండా ఉండరు. ఇంటి ద‌గ్గ‌ర్లో తన చెల్లితో కలిసి వాకర్​ ఆడుకుంటుండగా.. ఓ కుక్క ఒక్క‌సారిగా అటాక్ చేసింది. దీంతో త‌న బుజ్జి సోద‌రిని కాపాడానికి అత‌డు వీరోచితంగా పోరాడాడు. కుక్క దాడి చేస్తోన్నా.. ఓ యోధుడిలా దానిని ఎదిరించి నిల‌బ‌డ్డాడు. ఈ స‌మ‌యంలో తన ముఖం చిట్లి రక్తం దార‌లుగా కారుతున్నా..అత‌డు పోరాటం ఆప‌లేదు. ఆఖరుకు అరుపులు విని వారి పేరెంట్స్ అక్క‌డికి చేరుకున్నారు. అప్పటికే ముఖం క‌న‌ప‌డ‌కుండా ర‌క్తంతో నిండిపోయింది. తన సోద‌రిని కాపాడ‌టానికి…అత‌డు ప్రాణాలే ప‌ణంగా పెట్టాడు. ఆ త‌ర్వాత బ‌డ‌త‌డిని ఆస్ప‌త్రికి తీసుకెళ్ల‌గా… ఏకంగా 90 కుట్లు పడ్డాయి. ఆపరేషన్​ చేసేందుకు వైద్యులు రెండు గంటలు శ్రమించారట.

ఈ విషయాన్ని బాల‌డి అత్త సామాజిక మాధ్య‌మాల్లో పెట్టగా.. విపరీతంగా ట్రెండింగ్ అయింది. బాలుడి పోరాట పటిమను అందరూ ప్రైజ్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ప్రపంచ బాక్సింగ్​ కౌన్సిల్​ చిన్నోడిని ప్రపంచ బాక్సింగ్​ ఛాంపియన్​(గౌరవార్థం)గా అనౌన్స్ చేసింది. బ్రిడ్జర్​కు అవార్డు ఇవ్వడాన్ని హెవీవెయిట్​ ఛాంపియన్​ టైసన్​ ఫ్యూరీ వంటి వారు చాలామంది స్వాగతించారు.  కమిలిపోయిన‌ ముఖంతో ఉన్న బ్రిడ్జర్​ ఫొటోకు భారీగా లైక్​లు, లక్షల సంఖ్య‌లో లైకులు, షేర్లు వ‌స్తున్నాయి.

కుక్క దాడికి య‌త్నించిన‌ప్పుడు ఎందుకు పారిపోలేదని తండ్రి.. బ్రిడ్జర్​ను అడ‌గ్గా.. మ‌న‌సు హత్తుకునే సమాధానం ఇచ్చాడట. “కుక్క చేతిలో ఎవరైనా చ‌నిపోవాల్సి వస్తే.. అది నేను మాత్రమే అయి ఉండాలి అనుకున్నా” అని చెప్పేస‌రికి తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నాడ‌ట‌. ఇప్పుడు చెప్పండి ఈ బుడ్డోడిని మీరు ప్ర‌శంసించ‌కుండా ఉండ‌గ‌లారా..!

6-year-old gets 90 stitches saving his sister from dog attack; named 'honorary World Champ'