యుఏఈలో సొట్టబుగ్గల సుందరి, కంగారుగా ఉందట

సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుంది. దీంతో అన్ని జట్ల ఆటగాళ్లు పొట్టి క్రికెట్ యుద్దానికి సన్నద్దమై ఉన్నారు.

  • Ram Naramaneni
  • Publish Date - 5:30 pm, Thu, 17 September 20

సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుంది. దీంతో అన్ని జట్ల ఆటగాళ్లు పొట్టి క్రికెట్ యుద్దానికి సన్నద్దమై ఉన్నారు. ఇండియాలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో ఈ సారి యూఏఈలో ఐపీఎల్ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. అక్కడ వాతావరణ పరిస్థితులకు అలవాటుపడేందుకు ఆటగాళ్లకు ప్రాంఛైజీలు అన్ని ఏర్పాట్లు చేశాయి. టీం యాజమాన్యలు ప్లేయర్స్ బాగోగులు దగ్గరుండి చూసుకుంటున్నాయి.

ఇందులో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కో ఓనర్, సొట్ట బుగ్గల సుందరి ప్రీతి జింతా యూఏఈలో అడుగుపెట్టారు.  ప్రస్తుతం క్వారెంటైన్‌లో ఉన్న ఆమెకు నిబంధనల ప్రకారం రెగ్యులర్ గా కోవిడ్ టెస్ట్స్ చేస్తున్నారు. ఇప్పటివరకు చేసిన టెస్టుల్లో ఆమెకు నెగిటివ్ అని వచ్చింది. అయితే చివరిగా  చేయబోయే టెస్ట్ విషయంలో ఆమె కాస్త కంగారు పడుతుందట.  ఈ క్రమంలో ఆమె జట్టుకు పంపిన వీడియో సందేశాన్ని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేరు చేసింది. ఐపీఎల్ అంటే ప్రీతి జింతా సందడి కూడా భాగమే. ప్లై కిస్సులతో, డాన్స్‌ చేస్తూ పంజాబ్ ప్లేయర్స్  ను ఆమె ఉత్సాహపరుస్తూ ఉంటుంది.

 

View this post on Instagram

 

Preity woman da special message for #SaddaSquad 🥰 Hit it! ▶️ #SaddaPunjab #Dream11IPL

A post shared by Kings XI Punjab (@kxipofficial) on