కర్నూలులో భారీ వర్షాలు..శైవ క్షేత్రాలను ముంచేత్తిన గంగ

Kurnool heavy Rains.Mahanandi Temple in Water, కర్నూలులో భారీ వర్షాలు..శైవ క్షేత్రాలను ముంచేత్తిన గంగ

కర్నూలు జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.. జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు నంద్యాల నీట మునిగింది. నంద్యాల డివిజన్ లోని మహానంది, గడివేముల, గోస్పాడు, బండిఅత్మకూరు మండలాలలో నిన్న అర్ధరాత్రి భారీ వర్షం పడింది. మహనందిలో  87.4, బండిఅత్మకూరు 55.8, గడివేముల 92.6, గోస్పాడు 69.2  మండలాలలో మిల్లీమీటర్ల  వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. మహానంది మండలంలోని పాలేరు,రాళ్ళ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో మహనంది క్షేత్రానికి రాకపోకలు పూర్తిగా అగిపోయాయి.
నంద్యాల పట్టణంలో కురిసిన వర్షాలకు కుందూ, మద్దిలేరు, చామకాల్వ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కుందూ పరివాహక ప్రాంతంలోని పంటపొలాలు పూర్తిగా నీట మునిగాయి. పట్టణంలోని దేవనగర్,శ్యామ్ నగర్,వి.సి.కాలని,అరుంధతి నగర్,సరస్వతి నగర్ లలో ఇండ్లలోకి చేరిన వర్షపు నీటి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పట్టణంలోని ప్రధాన రహదారులైన
శ్రీనివాస సెంటర్, సంజీవ నగర్, పద్మావతీ నగర్ లలో డ్రైనేజీ వాటర్ రోడ్ల పై ప్రవహించటంతో వాహన దారులు, ప్రయాణికులకు అవస్థలు తప్పలేదు. నాలుగు రోజుకులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వేల ఎకరాలలో వరి పంట దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. జొన్న,ప్రత్తి, మిరప,శెనగ,పసుపు,అరటి పంటలు కూడా పూర్తిగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలుపుతున్నారు.వాగులు,వంకలు, ఉప్పొంగి ప్రవహించటంతో..ప్రముఖ శివాలయాలైన బ్రహ్మనందీశ్వర స్వామి, భోగేశ్వర స్వామి ఆలయాల్లోకి భారీగా నీరు చేరింది. దశాబ్దాల కాలంగా ఏ రోజు కూడా ఆలయ‌ పరిసరాల కు రాని నీరు ఇప్పుడు ఏకంగా అలయ గర్బ గుడిలోకి రావడం విశేషంగా భావిస్తున్నారు ఆలయ పూజారులు. ఇది అంతా శివలీల అంటు భక్తులు స్వామి వారిని దర్శించుకోవడానికి క్యూ కడుతున్నారు.
అటు, .మహానంది మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రం మహానందిలో భారీ వర్షాల కారణంగా ఆలయంలోకి  వరద నీరు ప్రవేశించింది. వరద నీటితో గుడిలోని మూడు కొనేరులు నిండి గాలిగోపురం నుండి నీళ్లు బయటకు ప్రవాహించాయి. ఆలయ చరిత్రలోనే ఇలాంటి  సంఘటన తామూ ఎప్పుడూ చూడలేదని స్దానికులు చెబుతున్నారు. ఎంత భారీ వర్షం పడిననా నీరు ఆలయంలోకి ప్రవేశించడం కాని కోనేరులో  నీరు నిండిపోవడం కాని తాము ఎప్పుడు చూడలేదని చెప్పారు. గత మూడు రోజులుగా కురుస్తున్నవర్షాలకు మూడు ప్రముఖ శైవ క్షేత్రాలైన మహానంది, బ్రహ్మనందీశ్వర స్వామి, భోగేశ్వర స్వామి దేవాలయాలలో నీరు ప్రవేశించడం విశేషం గా చెప్పుకుంటున్నారు. దశాబ్దాల కాలంగా  ఇలాంటి సంఘటన శైవ క్షేత్రాలలో నీరు చేరడం ఎవరు చూడలేదు. ఇది కేవలం శివలీల అంటు భక్తులు నమ్ముతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *