సీఎం చంద్రబాబుపై కేటీఆర్ ఫైర్

ఏపీకి వెళ్లి రాజకీయం చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ముసుగు రాజకీయాలపై పేటెంట్ చంద్రబాబుకే ఉందన్నారు. ఏం చేసినా తాము నేరుగా చేస్తామన్నారు. ఏపీకొస్తే తెలుగు వారి సత్తా చూపిస్తామంటున్న చంద్రబాబుకు.. తెలంగాణలో తెలుగు వారి సత్తా ఏంటో తెలియలేదా… అంటూ ప్రశ్నించారు కేటీఆర్. అయినా.. మేము అమలు చేసిన సంక్షేమ పథకాలనే చంద్రబాబు కాపీ చేస్తున్నారని ఆరోపించారు. మేము పెట్టిన అన్నపూర్ణ క్యాంటీన్ కి అన్నా క్యాంటీన్ అని పెట్టారన్నారు. […]

సీఎం చంద్రబాబుపై కేటీఆర్ ఫైర్
Follow us

| Edited By:

Updated on: Feb 26, 2019 | 11:38 AM

ఏపీకి వెళ్లి రాజకీయం చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ముసుగు రాజకీయాలపై పేటెంట్ చంద్రబాబుకే ఉందన్నారు. ఏం చేసినా తాము నేరుగా చేస్తామన్నారు. ఏపీకొస్తే తెలుగు వారి సత్తా చూపిస్తామంటున్న చంద్రబాబుకు.. తెలంగాణలో తెలుగు వారి సత్తా ఏంటో తెలియలేదా… అంటూ ప్రశ్నించారు కేటీఆర్. అయినా.. మేము అమలు చేసిన సంక్షేమ పథకాలనే చంద్రబాబు కాపీ చేస్తున్నారని ఆరోపించారు. మేము పెట్టిన అన్నపూర్ణ క్యాంటీన్ కి అన్నా క్యాంటీన్ అని పెట్టారన్నారు. వృద్ధుల పింఛన్ల విషయంలో, నిరుద్యోగుల పథకాల విషయంలో సీఎం చంద్రబాబు మమ్మల్ని కాపీ చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. అలాగే.. టీడీపీ పార్టీ ప్రతీ ఎన్నికల టైంలో ఎవరితో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని విజయం సాధిస్తున్నారని.. కానీ టీఆర్ఎస్ పార్టీ మాత్రం సొంతంగా ప్రజల మద్దుతోనే ఎన్నికల బరిలో నిలిచామన్నారు.